దేశవ్యాప్తంగా ‘ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్‌3ఎన్‌2’ కలకలం.. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు

Ex-Aims Chief Says Influenza Virus H3N2 Spreads Like Covid Elderly Should be Careful,Ex-Aims Chief Says, Influenza Virus H3N2 Spreads Like Covid, Elderly Should be Careful, Mango News,Mango News Telugu,Influenza Virus H3N2,Influenza Virus H3N2,Influenza Virus H3N2 News,H3N2 Influenza Virus,H3N2 Influenza Virus Spread,H3N2 Virus,H3N2 Virus cases,H3N2 Virus Latest News,H3N2 Virus Cases,H3N2 Virus Cases Upates,H3N2 Virus Virus Attack

దేశవ్యాప్తంగా కొత్త ‘ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్‌3ఎన్‌2’ కలకలం సృష్టిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో వందలాది మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇక దీని బారిన పడిన వారిలో ప్రధానంగా జ్వరం, దగ్గు లక్షణాలతో బాధపడుతున్నారు. దీనిపై ఇప్పటికే భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. తాజాగా దీనిపై ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. హెచ్‌3ఎన్‌2 వైరస్ వల్ల కలిగే ఇన్‌ఫ్లుఎంజా కేసుల పెరుగుదల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో ప్రతి సంవత్సరం ఈ వైరస్‌ సాధారణంగా మార్పులకు లోనవుతుందని, పరివర్తనాల ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. దీనిని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారని, గతంలో వచ్చిన హెచ్‌1ఎన్‌1 వైరస్ ఇప్పుడు హెచ్‌3ఎన్‌2గా రూపాంతరం చెందిందని తెలిపారు.

అయితే ప్రస్తుతం రూపాంతరం చెందిన వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఈ వైరస్‌ కోవిడ్‌-19 వలే వ్యాపిస్తోందని గులేరియా విశ్లేషించారు. ఇక రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే ప్రజలు సులభంగా ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నారని, వీరిలో జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, ముక్క కారడం వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయని గులేరియా వివరించారు. పండుగల సీజన్‌ సమీపిస్తున్నందున, ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ వైరస్ బారిన పడుతున్నారని, ప్రజలందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులను శుభ్రపరుచుకోవాలని డాక్టర్‌ రణదీప్‌ గులేరియా సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 2 =