రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త, డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నిధుల పంపిణీ

CM KCR Pronounced Good News to Farmers of Telangana Rythu Bandhu Funds Distribution Starts From December 28th,Rythu Bandhu will Deposit ,CM KCR Rythu Bandhue,Rythu Bandhu Devolepment,Rythu Bandhu Latest News and Updates,Rythu Bandhu,Telangana Rythu Bandhu,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Rythu Bandhu News and Live Updates,Rythu Bandhu Latest News,Telangana Rythu Bandhu News and Updates

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభవార్త అందించారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి ‘రైతుబంధు’ నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. రైతుబంధు నిధులు ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై, సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయని, ఇందుకు గాను 7,600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నదని తెలిపారు.

“రైతుబంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం, పంట పెట్టుబడిని అందించడం, దేశ వ్యవసాయరంగంలో విప్లవాత్మక కార్యాచరణగా సత్ఫలితాలనిస్తున్నది. ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్తు, రైతు బీమాతో పాటు పంటలు పండించేందుకు నేరుగా రైతు ఖాతాలో పెట్టుబడిని అందించడం ద్వారా తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా దేశ వ్యవసాయరంగ నమూనా మార్పుకు దారితీసింది. సీఎం కేసిఆర్ వ్యవసాయ అనుకూల దార్శనిక నిర్ణయాలు, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయి. దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి” అని తెలిపారు.

పలు మార్గాల నుండి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన 40 వేల కోట్ల రూపాయలను రాకుండా కేంద్రం తొక్కిపెట్టిందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ తెలంగాణ రైతులను ప్రజలను కష్టాల పాలు చేయాలని కేంద్రం చూస్తున్నదన్నారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ధి విషయంలో ఎన్ని కష్టాలెదురైనా రాజీ పడకుండా రైతులకు రైతుబంధు నిధులను టంచనుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. ఎలాంటి కోతలు లేకుండా, రైతులందరికీ పూర్తి స్థాయిలో సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రెటరీకి సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఈ నిర్ణయం రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల సీఎం కేసిఆర్ పాలనకున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − four =