దేశంలో తోలి బర్డ్ ఫ్లూ మరణం నమోదు, ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ 11 ఏళ్ల బాలుడు మృతి

AIIMS Hospital, Bird Flu, Bird Flu Death, Bird Flu In Delhi, Delhi’s AIIMS Reports First Bird Flu Death, First Bird Flu Death in India, First bird flu death in India this year, First Bird Flu Death in India This Year Reported at AIIMS, First Bird Flu Death in India This Year Reported at AIIMS Hospital, First Bird Flu Death in India This Year Reported at AIIMS Hospital at New Delhi, Mango News, New Delhi

దేశంలో తోలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చికిత్స పొందుతూ హర్యానాకు చెందిన 11 ఏళ్ల బాలుడు బర్డ్‌ ఫ్లూతో చనిపోయాడు. బర్డ్ ఫ్లూను హెచ్5ఎన్1 వైరస్ లేదా ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజాగా పిలుస్తారు. దేశంలో హెచ్5ఎన్1 ఒక మనిషికి సోకడం ఇదే తొలిసారి. జూలై 2న హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియాతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. అయితే అతనికి ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ వచ్చిందని, అనంతరం నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా హెచ్5ఎన్1 గా నిర్ధారణ అయిందని తెలిపారు. సుశీల్ కు చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ప్రస్తుతం ఐసోలేషన్‌ లో ఉన్నారు.

మరోవైపు మనిషిలో హెచ్5ఎన్1 వైరస్ వెలుగుచూడడంతో మరింత కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఒక బృందాన్ని హర్యానాలోని సుశీల్ గ్రామానికి పంపించింది. ఈ సంవత్సరం ఇప్పటికే పలు రాష్ట్రాలలో పలు పక్షుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అయితే ఇది మానవులకు సోకడం తక్కువని, అత్యంత ప్రమాదకరం కాదని నిపుణులు పేర్కొన్నారు. అలాగే బర్డ్ ఫ్లూ పక్షులలో అంటువ్యాధిగా ఉంటూ, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధికి కారణమవుతుందని, ఈ వైరస్ మానవులకు అరుదుగా సోకుతుందని తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =