గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకై 10 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా విడుదల

Gujarat Assembly Elections Aam Aadmi Party Released First List of Ten Candidates, Aam Aadmi Party Released First List of Ten Candidates, AAP releases first list of 10 candidates, AAP 10 candidates, Gujarat Assembly Elections 2022, 2022 Gujarat Assembly Elections, Gujarat Assembly Elections, CM Arvind Kejriwal announces first list of 10 candidates, Gujarat Assembly polls, Delhi CM Arvind Kejriwal, Aam Aadmi Party, Aam Aadmi Party Gujarat Assembly Candidates, AAP Gujarat Assembly Candidates, Gujarat Assembly Elections 2022 News, Gujarat Assembly Elections 2022 Latest News, Gujarat Assembly Elections 2022 Latest Updates, Gujarat Assembly Elections 2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఢిల్లీ, పంజాబ్ లలో ఇప్పటికే ఘన విజయాలు సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించి, అక్కడ వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పది మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం నాడు విడుదల చేసింది. గుజరాత్‌ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి.

మరోవైపు సోమవారం గిర్ సోమనాథ్ జిల్లా వెరావల్ పట్టణంలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, గుజరాత్‌ లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం వచ్చేలా తమ పార్టీ హామీ ఇస్తుందనన్నారు. ఉద్యోగాలు కల్పించే వరకు ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా అధికారంలోకి వస్తే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలకు గతంలోనే హామీ ఇచ్చారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకై 10 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా:

  1. భీమాభాయ్ చౌదరి – దేవధర్
  2. జగ్మల్ వాలా – సోమనాథ్
  3. అర్జున్ రథ్వా – చోటా ఉదయపూర్
  4. సాగర్ రాబరీ – బేచారాజి
  5. వశ్రమ్ సగాతియా – రాజ్ కోట్ రూరల్
  6. రామ్ ధడుక్ – కామ్రేజ్
  7. శివలాల్ బరాసియా – రాజ్ కోట్ సౌత్
  8. సుధీర్ వఘాని – గరియాధార్
  9. రాజేంద్ర సోలంకి – బార్డోలీ
  10. ఓంప్రకాష్ తివారీ – నరోడా

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =