బీజేపీ బిగ్ ప్లాన్.. కేంద్ర కేబినెట్‌లోకి ఆ నేతలు

BJPs Big Plan Those Leaders In The Central Cabinet, BJPs Big Plan, Those Leaders In The Central Cabinet, Central Cabinet Leaders BJP, PM Modi, Modi Cabinet, Bharateeya Janata Party, Latest BJPs Central Cabinet News, Central Cabinet, BJP, Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
PM Modi, Modi Cabinet, Bharateeya janata party

ఎర్రకోటపై కాషాయపు జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది భారతీయ జనతా పార్టీ. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి హ్యాట్రిక్ కొట్టాలని నరేంద్ర మోడీ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సరికొత్త వ్యూహాలను రచిస్తోంది.  త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడంపై ఫోకస్ పెట్టింది.  ప్రతిపక్ష ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలి?.. ఎన్నికలవేళ అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది.

ఈక్రమంలో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట. లోక్ సభ ఎన్నికలకంటే ముందే వారిని కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా.. ఆయా రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలకు దక్కించుకోవచ్చని బీజేపీ భావిస్తోందట. ఈక్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సిధియా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లను సెంట్రల్ కేబినెట్‌లోకి తీసుకోవాలని బీజేపీ యోచిస్తోందట.

కర్ణాటకపై బీజేపీకి మంచి పట్టు ఉంది. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ గద్దె దిగిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈక్రమంలో లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం కష్టంగా మారింది. అందుకే ప్రాంతీయ పార్టీ జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని జేడీఎస్ అధినేత కుమారస్వామిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవచ్చిన బీజేపీ పథకం పన్నుతోంది.

ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా ఎలక్షన్లు జరిగాయి. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీనే గెలుపొంది అధికారంలోకి వచ్చింది. కానీ బీజేపీ హైకమాండ్ ఆయా రాష్ట్రాల్లో పలుమార్లు ముఖ్యమంత్రులుగా పని చేసిన వసుంధర రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్‌లను పక్కకు పెట్టి వారే వారికి అవకాశం కల్పించింది. దీంతో ఈ ఇద్దరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఆ ప్రభావం వచ్చే లోక్ సభ ఎన్నికలపై పడకుండా ఆ ఇద్దరిని సెంట్రల్ కేబినెట్‌లోకి తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోందట.

ఇకపోతే ఇటీవల శిసేనను కూల్చి మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈక్రమంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను పక్కకు పెట్టి ఏక్ నాథ్ షిండేకు బీజేపీ హైకమాండ్ ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ఫడ్నవీస్‌కు డిప్యూటీ పదవి ఇచ్చింది. అటు ఆయన కూడా అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. అందుకే దేవేంద్ర ఫడ్నవీస్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోందట. త్వరలోనే ఈ నలుగురు నేతలను కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − three =