తీవ్రవాదంపై పాకిస్తాన్ జర్నలిస్టు ప్రశ్న, కౌంటర్ ఇచ్చిన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

Indian External Affairs Minister Jai Shankar Responds Over Pakistan Journalist Question on Terrorism,Pakistan Journalist Question on Terrorism,Indian External Affairs Minister,Minister Jai Shankar,Mango News,Mango News Telugu,Pakistan Journalist,Pakistan Journalist Latest News and Updates,External Affairs Minister S. Jai Shankar,Mahatma Gandhi Statue,UN Headquarters,Minister S Jaishankar,Mahatma Gandhi Statue In London,Mahatma Gandhi Statue In Uk,Un Headquarters,Un Headquarters Statues,Un Headquarters Around The World,Un Headquarters In The World,Un Headquarters Agreement,Un Headquarters Sculpture

న్యూఢిల్లీ, కాబూల్, పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదం వ్యాప్తి చెందడాన్ని దక్షిణాసియా ఎంతకాలం చూస్తోందని పాక్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్న మీరు నన్ను కాదు, పాకిస్తాన్ మంత్రిని, నేతలను అడగాలి అని ఆయన బదులిచ్చారు. ఎందుకంటే పాకిస్థాన్‌ ఎంతకాలం ఉగ్రవాదాన్ని ఆచరించాలనుకుంటుందో పాకిస్థాన్‌ మంత్రులే మీకు చెబుతారు అని కూడా జైశంకర్‌ ఆ జర్నలిస్టుకి సూచించారు. యూఎన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ స్టేక్‌అవుట్‌లో ‘గ్లోబల్‌ టెర్రరిజం అప్రోచ్‌: ఛాలెంజెస్‌’ అనే అంశంపై భారత అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రపంచమంతా పాకిస్థాన్‌ను ఉగ్రవాదానికి కేంద్రంగా చూస్తోందని ఈ సందర్భంగా జైశంకర్ స్పష్టం చేశారు. ఈ రోజు ప్రపంచం వారిని ఉగ్రవాదానికి కేంద్రంగా పరిగణిస్తోంది తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అలాగే భారత్‌ కంటే ఉగ్రవాదాన్ని ఏ దేశమూ మెరుగ్గా ఉపయోగించుకోలేదు’ అని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ ఇటీవల చేసిన ఆరోపణపై కూడా జైశంకర్‌ సమాధానమిచ్చారు. దేశమంతా కోవిడ్‌తో గత రెండున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సమయంలో.. మరోవైపు దేశం సరిహద్దుల్లో అనేక తీవ్రవాద కార్యకలాపాలు జరగడం కూడా గమనించామని ఆయన వెల్లడించారు. 2011లో అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖార్‌తో కలిసి సంయుక్త వార్తా సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశించి ఆయన ఇలా అన్నారు.. ‘మీరు మీ పెరట్లో పాములను ఉంచుకోలేరు మరియు అవి మీ పొరుగువారిని మాత్రమే కాటువేస్తాయని ఆశించకూడదు’ అని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఇకనైనా తన చర్యలు ఆపి, మంచి పొరుగు దేశంగా ఉండటానికి ప్రయత్నించాలని జైశంకర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − six =