మినీ వేలంలో వాళ్లనే టార్గెట్‌ చేయనున్న ముంబై ఇండియన్స్‌

IPL 2023 Mini Auction Mumbai Indians Might Target Those Three Key Players,IPL 2023 Mini Auction,Mumbai Indians Might Target,Those Three Key Players,IPL 2023 Three Key Players,Mango News,Mango News Telugu,IPL 2023 Mini Auction Mumbai Indians Might Target Those Three Key Players,IPL 2023 Latest News,IPL 2023 Latest Updates,Mumbai Indians Key Players News,Mumbai Indians Key Players Latest News,Mumbai Indians Key Players Live Updates,IPL 2023 Mini Auction News Today,IPL 2023 Mini Auction Latest News

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ సమాయత్తమవుతోంది. ఇప్పటికే టీమ్ ప్రక్షాళనను ప్రారంభించిన ముంబై ఫ్రాంచైజీ.. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పేస్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగాను నియమించుకున్న ముంబై ఇండియన్స్.. రిలీజ్ చేసే ఆటగాళ్లతో ఓ జాబితాను కూడా సిద్ధం చేసింది.

ఐపీఎల్ 2023 సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2లో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటం ఆ జట్టు కొంపముంచింది. ఈ క్రమంలోనే ఆ విభాగాన్ని పటిష్టం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లాతో పాటు యువ స్పిన్నర్ హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్‌, క్రిస్ జోర్డాన్‌లను వదులుకునేందుకు సిద్ధమైంది. భారీ ధరకు కొనుగోలు చేసిన జోఫ్రా ఆర్చర్.. మునపటిలా బౌలింగ్ చేయకపోవడంతో అతన్ని కూడా వదులుకోవాలని డిసైడైంది. బుమ్రా రీఎంట్రీ ఇవ్వడంతో ఆర్చర్‌ను వదులుకోవాలనుకుంటోంది.

డిసెంబర్‌లో జరిగే ఐపీఎల్ మినీ వేలంలో ఓ ముగ్గురి ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ టార్గెట్‌గా పెట్టుకుంది. స్పిన్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు రవి బిష్ణోయ్‌ను తీసుకోవాలనుకుంటోంది. అతనితో పాటు క్రిస్ వోక్స్, హర్షల్ పటేల్‌ల కోసం ముంబై ఫ్రాంచైజీ ప్రయత్నాలను మొదలు పెట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న రవి బిష్ణోయ్.. ఆ జట్టుకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అదే జరిగితే ట్రేడింగ్ విండో ద్వారా లేకుంటే వేలంలో రవి బిష్ణోయ్‌ను తీసుకునేందుకు ముంబై ఇండియన్స్ ప్రయత్నించనుంది. యాషెస్ సిరీస్‌లో సత్తా చాటిన క్రిస్ వోక్స్‌పై కూడా ముంబై ఫ్రాంచైజీ ఫోకస్ పెట్టింది. అతన్ని జట్టులోకి తీసుకుంటే పేస్ విభాగంతో పాటు బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుందని భావిస్తోంది. కీరన్ పొలార్డ్‌కు అతనే సరైన రిప్లేస్‌మెంట్ అని భావిస్తోంది. ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లో క్రిస్ వోక్స్ 19 వికెట్లతో సత్తా చాటాడు. ఇప్పటి వరకు 21 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన క్రిస్ వోక్స్ 30 వికెట్లు తీశాడు.

ఇక ఆర్‌సీబీలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న హర్షల్ పటేల్‌ను తీసుకునేందుకు కూడా ముంబై ఇండియన్స్ ప్రయత్నిస్తోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో హర్షల్ పటేల్ గొప్ప ప్రదర్శన చేయలేదు. 14 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 13 వికెట్లు మాత్రమే తీశాడు. పైగా చిన్నస్వామి వంటి చిన్న స్టేడియంలో హర్షల్ పటేల్ తేలిపోతున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని ఆర్‌సీబీ వదులుకునే అవకాశం ఉంది. అదే జరిగితే వేలంలో హర్షల్ పటేల్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముంబై వంటి స్లో పిచ్‌పై అతను కీలకం కానున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 4 =