జంతర్ మంతర్‌ వద్దకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. మహిళా రెజ్లర్ల ఆందోళనకు సంఘీభావం

Congress Leader Priyanka Gandhi Vadra Meets The Wrestlers Protesting Against WFI Chief at Jantar Mantar Delhi,Congress Leader Priyanka Gandhi Vadra,Priyanka Gandhi Vadra Meets The Wrestlers,Wrestlers Protesting Against WFI Chief,Wrestlers Protesting at Jantar Mantar Delhi,Mango News,Mango News Telugu,Congress Leader Priyanka Gandhi Latest News,Priyanka Gandhi joins protesting wrestlers,Congress Leader Priyanka Gandhi Latest Updates,Congress Leader Priyanka Gandhi Live News,Congress Leader Priyanka Gandhi News Today,Congress Leader Priyanka Gandhi

ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ మరియు ఇతర ఉన్నతాధికారులు కొందరు మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గత కొన్ని రోజులుగా భారత రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరికి సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ వాద్రా ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలిశారు. నిరసన వేదిక వద్ద, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లేదా ఎఫ్‌ఐఆర్ కాపీని అందించనందుకు ఢిల్లీ పోలీసులపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రెజ్లర్లు పతకాలు సాధించినపుడు మనమందరం ట్వీట్లు చేసి అభినందిస్తున్నాం,అయితే నేడు వారు న్యాయం కోసం రోడ్డుపై కూర్చున్నారు, దీనికి కూడా అందరూ వారికి మద్దతు తెలపాలి. ఇన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించడం లేదు. ఆయన వారితో మాట్లాడేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు? డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌ను రక్షించడానికి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది?’ అంటూ ప్రియాంక ప్రశ్నల వర్షం కురిపించారు.

కాగా డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఢిల్లీ పోలీసులు శుక్రవారం రెండు కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లలో ఒకటి మైనర్ పైన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై ఉంది. అలాగే ఇంకోటి లైంగిక నేరాల నుండి పిల్లల కోసం కఠినమైన రక్షణ (పోక్సో) చట్టం కింద దాఖలు చేయబడింది. కాగా ఈ కేసు కింద బెయిల్‌కు అవకాశం ఉండదు. ఢిల్లీ పోలీసులు ఈ కేసును వేగంగా విచారిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, మరోవైపు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. తాము సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, అయితే తమకు ఢిల్లీ పోలీసులపై నమ్మకం లేదని వారు తెలిపారు. ఇక ఈ పోరాటం ఎఫ్‌ఐఆర్ కోసం కాదని స్పష్టం చేసిన రెజ్లర్లు, ఇది అతనిలాంటి వారిని శిక్షించడానికేనని, ఆయనకు శిక్ష పడాల్సిందేనని, అంతకంటేముందు ఆయనను అన్ని పదవుల నుంచి తప్పించాల్సిందేనని తేల్చి చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − ten =