తెలంగాణ రాష్ట్రంలో సినిమా హాళ్లు తెరిచేందుకు అనుమతి, నిబంధనలు ఇవే…

Cinema Theatres reopen, Cinema Theatres reopen in telangana, CM KCR, CM KCR Released TRS Manifesto, GHMC Elections, Greater Hyderabad Municipal Corporation, Mango News, Reopen Cinema Theatres and Multiplexes, Telangana Gives Permission to Reopen Cinema Theatres, Telangana Govt, Telangana Govt Gives Permission to Reopen Cinema Theatres, Telugu Film Industry, TRS Manifesto For GHMC Elections

తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్సులు తెరిచేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంటైన్మెంట్ జోన్ల మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు, మల్టీఫ్లెక్సులు తిరిగి తెరుచుకోవచ్చని ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

సినిమా థియేటర్లు/మల్టీప్లెక్స్‌ల యాజమాన్యం పాటించాల్సిన నిబంధనలు:

  • ప్రేక్షకులు, థియేటర్ సిబ్బంది, విక్రేతలు ఇలా అందరూ అన్ని సమయాల్లో మాస్కులు ధరించేలా చూడాలి.
  • హ్యాండ్ శానిటైజర్లను ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు సహా కామన్ ప్రాంతాలలో అందుబాటులో ఉంచాలి.
  • భౌతిక దూరం పాటించడంతో పాటుగా ప్రేక్షకులు గుంపుగూడకుండా చర్యలు తీసుకోవాలి.
  • ప్రతి స్క్రీనింగ్ తరువాత మొత్తం ప్రాంగణం, ముఖ్యంగా కామన్ ప్రాంతాలను శానిటైజ్ చేయాలి.
  • అన్ని ఎయిర్ కండిషనింగ్ (ఏసీలు) పరికరాల ఉష్ణోగ్రత సెట్టింగ్ 24-30 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉండాలి. సాపేక్ష ఆర్ద్రత 40-70 శాతం పరిధిలో ఉండాలి. సాధ్యమైనంత వరకు స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఏర్పాట్లు చేయాలి.
  • మల్టీఫ్లెక్సులు/థియేటర్ కాంప్లెక్స్ లో వేర్వేరు ప్రదర్శనల(షోలు) ఇంటర్వల్ సమయం ఒకేసారి రాకుండా, షో టైమింగ్స్ ఏర్పాటు చేసుకోవాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − six =