యూపీఐ పేమెంట్ చేసేముందు ఇవి తెలుసుకోండి..

Know These Things Before Making UPI Payment, Before Making UPI Payment, Things Making UPI Payment, 5 UPI Payment Rules, NPCI,AFA,Google Pay, Paytm, PhonePe, UPI Payment, Certain Merchants,Interchange Fee, Latest UPI Payment News, Technology, Mango News, Mango News Telugu
5 UPI payment rules, NPCI,AFA,Google Pay, Paytm, PhonePe , UPI Payment, Certain merchants,Interchange Fee

ఒకప్పుడు బ్యాంకులకు, ఏటీఎమ్‌లకు వెళ్లి మనీ డ్రా చేసుకుని మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టేవారు. ఏం కొనాలన్నా కూడా  డబ్బులతోనే పని. కానీ ఇప్పుడు లక్షల్లో బంగారం కొనాలన్నా.. పది రూపాయల చాయ్ తాగాలన్నా స్మార్ట్ ఫోన్‌తోనే పని అయిపోతోంది. మొబైల్‌లో బ్యాంకింగ్ యాప్స్ వేసుకుని యూపీఐ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించి కావాల్సిన వస్తువులు క్షణాల్లో కొనుక్కుంటున్నారు.

మన దగ్గర అత్యంత ప్రజాదరణ పొందిన పేమెంట్ల మోడ్‌లలో.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అంటే యూపీఐ ఒకటిగా మారిపోయింది. 2016లో  నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..  ఈ యూపీఐ ప్లాట్ ఫామ్‌ను డెవలప్ చేసింది. భారతీయులు డబ్బు చెల్లించడం లేదా డబ్బులు పొందే విధానాన్ని మార్చింది.  కొన్ని నెలలుగా ఎన్‌పీసీఐ, యూపీఐ పేమెంట్లలో చాలా మార్పులను తీసుకువచ్చింది.

2023 డిసెంబరులో, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ యూపీఐ పేమెంట్ల లావాదేవీల పరిమితిని గతంలో ఉన్న రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచినట్లు ప్రకటించారు. ఆసుపత్రులు, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ చెల్లింపులు చేయడానికి ఈ పెంపు వర్తిస్తుందని, ఆన్‌లైన్ చెల్లింపుల కోసం యూపీఐ పేమెంట్లను స్వీకరించనున్నట్టు  చెప్పారు.

గత ఏడాదిలో ఎన్‌పీసీఐ.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి పేమెంట్ల యాప్‌లు, ఇతర బ్యాంకులకు.. డిసెంబర్ 31, 2023 నాటికి ఒక ఏడాదికి పైగా యాక్టివ్‌గా లేని ఇన్‌యాక్టివ్ యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని  ఆదేశించింది. తమ పాత నంబర్‌ను బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి కస్టమర్లు లింక్ చేయకుండా మొబైల్ నంబర్‌ను మార్చుకుంటే.. పాత ఫోన్ లింక్ అయినవారికి అనుకోకుండా డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. దీనిని అడ్డుకోవడానికి  ఈ నిర్ణయం తీసుకున్నారు.

లక్ష రూపాయల వరకు యూపీఐ పేమెంట్లు చేయడానికి కొన్ని సందర్భాల్లో ఇకపై అదనపు ఫ్యాక్టర్ అథెంటికేషన్  అవసరం లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఎఎఫ్ఏ లేకుండా క్రెడిట్ కార్డ్ రీపేమెంట్, మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్‌, ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం రికరింగ్ పేమెంట్‌లకు ఉపయోగించే ఈ మాండేట్‌ల పరిమితిని పెంచుతున్నట్లు ఆర్బీఐ  ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి ముందు ఎఎఫ్ఎ లేకుండా ట్రాన్స్‌ఫర్ చేయగల డబ్బు పరిమితి రూ. 15వేలుగా ఉండేది.

అంతేకాదు ఆఫ్‌లైన్‌లో చేసిన యూపీఐ లైట్ వాలెట్‌ల లావాదేవీ లిమిట్‌ను కూడా రూ. 200 నుంచి రూ. 500కి పెంచారు. నగదు ట్రాన్స్‌ఫర్ చేయగల గరిష్టం రూ. 2వేలుగా ఉంచారు. ఇంటర్నెట్ కనెక్షన్‌లు తక్కువగా ఉన్న ప్రాంతాలలో యూపీఐ-లైట్ వాలెట్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే సర్టైన్ మర్చెంట్స్ చేసే యూపీఐ ద్వారా చేసే పేమెంట్లపై 1.1శాతం ఇంటర్‌చేంజ్ ఫీజును విధిస్తున్నట్లు ఎన్‌పీసీఐ ప్రకటించింది. ఆన్‌లైన్ వ్యాలెట్ల వంటి ప్రీపెయిడ్ పేమెంట్ల టూల్స్ ఉపయోగించి చేస్తే.. రూ. 2వేల కన్నా ఎక్కువ ఫీజు వర్తిస్తుంది.

పెరుగుతున్న ఆన్‌లైన్ పేమెంట్ల మోసాలకు చెక్ పెట్టడానికి , ఆర్బీఐ కొత్తగా యూపీఐ పేమెంట్లు అందుకునే యూజర్లకు రూ. 2వేల కన్నా ఎక్కువ మొత్తాన్ని.. మొదటి సారి పేమెంట్లు చేసే కస్టమర్లకు 4 గంటల టైమ్ లిమిట్‌ను పెట్టింది. యూజర్లు ఇంతకు ముందు లావాదేవీలు చేయని మరో వినియోగదారుకు రూ. 2వేల కన్నా ఎక్కువగా మొదటిసారి పేమెంట్ చేసిన ప్రతిసారీ కూడా ఈ కొత్త లిమిట్ వర్తిస్తుంది.

మరోవైపు ఎన్‌పీసీఐ బీటా వెర్షన్‌లో ..యూపీఐ ఫర్ సెకండరీ మార్కెట్‌ని స్టార్ట్ చేసినట్లు  కూడా ఎన్‌పీసీఐ  ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ ఫర్ సెకండరీ మార్కెట్ ఫెసిలిటీలో  భాగంగా ఎన్‌పీసీఐ యూపీఐ పేమెంట్ల యాప్ ద్వారా తమ ట్రాన్జక్షన్స్‌ను అందిస్తుంది.

హిటాచీ పేమెంట్ సర్వీసెస్ సహకారంతో .. దేశంలో మొట్టమొదటి యూపీఐ-ఏటీఎంని వైట్ లేబుల్ ఏటీఎంగా ప్రవేశపెట్టింది. దీనిలో వినియోగదారులు వారి బ్యాంక్ అకౌంట్ నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవడానికి డెబిడ్ కార్డు లేకుండా కేవలం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుంటే సరిపోతుంది. ఎన్ఎఫ్‌సీ ఫీచర్ ఉన్న ఫోన్‌లతో.. యూపీఐ వాడుతున్నవారికి  యూపీఐ ‘ట్యాప్ అండ్ పే’ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =