అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలకపాత్ర, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచింది – ప్రధాని మోదీ

PM Modi Attends For The Inaugural Meeting of CBIs Diamond Jubilee Celebrations in New Delhi Today,PM Modi Attends For The Inaugural Meeting of CBIs,CBIs Diamond Jubilee Celebrations,Diamond Jubilee Celebrations in New Delhi Today,Mango News,Mango News Telugu,PM Modi inaugurates Diamond Jubilee Celebrations,PM Modi Inaugurates CBI's Diamond Jubilee,PM Modi Speech Today,Narendra modi Latest News and Updates,PM Inaugural Meeting Latest News,PM Inaugural Meeting Latest Updates,PM Inaugural Meeting Live Today

దేశంలో అవినీతిపై పోరాటంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ది కీలకపాత్రని, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం న్యూ ఢిల్లీలో జరిగిన సీబీఐ వజ్రోత్సవ (డైమండ్ జూబ్లీ) వేడుకల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. 1963లో ఏర్పాటైన సీబీఐ తన పనితీరు, సామర్థ్యంతో సామాన్య ప్రజానీకం నమ్మకాన్ని సైతం చూరగొందని, ఏదైనా పరిష్కారం కాని కేసును బీఐకి అప్పగించాలనే డిమాండ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉందని తెలిపారు. వృత్తిపరమైన నిబద్ధత, సమర్ధత కలిగిన సీబీఐ వంటి సంస్థలు లేకుండా అభివృద్ధి భారతాన్ని నిర్మించడం సాధం కాదని, ఈ దిశగా సీబీఐపై అతిపెద్ద బాధ్యత ఉందని అన్నారు.

బ్యాంకులకు సంబంధించిన ఆర్ధిక నేరాల నుంచి వన్యప్రాణులకు సంబంధించిన మోసాల వరకు, సీబీఐ పని పరిధి చాలా రెట్లు పెరిగిందని, అవినీతి రహిత భారతదేశాన్ని రూపొందించడమే సీబీఐ ప్రధాన బాధ్యతని ప్రధాని మోదీ చెప్పారు. ఇక పదేళ్ల క్రితం, ఎంత భారీ అవినీతి చేస్తే అంత గొప్ప అన్నంతగా ఉండేదని, ఆ సమయంలో చాలా పెద్ద కుంభకోణాలు వెలలుగు చూశాయని తెలిపారు. అయితే 2014 తర్వాత 2014 తర్వాత తాము అవినీతి, నల్లధనం వెలికితీతపై యుద్ధప్రాతిపదికపై పనిచేశామని వివరించారు. ప్రజాస్వామ్యం, దేశాభివృద్ధికి అవినీతి పెద్ద అవరోధమని, అవినీతి ముక్త భారతంలో సీబీఐ పాత్ర కీలకమని, అలాగే అవినీతిపై పోరాటానికి బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అవినీతిని సహించరాదనేది ప్రభుత్వంతో పాటు ప్రజలందరి కోరికని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 11 =