మోదీ ప్రభుత్వం పార్లమెంటులో విపక్షాల గొంతు నొక్కేస్తోంది – బ్రిటన్‌ ఎంపీలతో సమావేశంలో రాహుల్‌ గాంధీ

Congress Leader Rahul Gandhi Says We Can't Switch Our Mics On in Our Parliament at British MP's Meet at London,Congress Leader Rahul Gandhi,We Can't Switch Our Mics On in Our Parliament,British MP's Meet at London,Mango News,Mango News Telugu,National Politics News,National Politics And International Politics,National Politics Article,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics

భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటులో విపక్షాల గొంతు నొక్కేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన బ్రిటన్‌ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం లండన్‌లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోని గ్రాండ్‌ కమిటీ రూంలో భారత్‌ సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇటీవలే ముగించిన కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర విశేషాలను కూడా ఆయన పంచుకున్నారు. అనంతరం ప్రవాస భారతీయులతో నిర్వహించిన మరో సమావేశంలో కూడా రాహుల్ పాల్గొన్నారు. కాగా ‘యూనిటీ, డైవర్సిటీ, ఇన్‌క్లూజన్‌’ అనే కాన్సెప్టుతో నిర్వహించిన సమావేశానికి పెద్దసంఖ్యలో ప్రవాసులు హాజరయ్యారు.

ఇక బ్రిటన్‌ ఎంపీలతో సమావేశంలో భాగంగా భారత్‌లో రాజకీయ నాయకుడిగా ఆయన అనుభవాలను చెప్పాలని కొందరు సభ్యులు కోరినప్పుడు రాహుల్‌ ఈ విధంగా స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వం పార్లమెంటులో విపక్షాల గొంతు నొక్కేస్తోంది. అయితే పార్లమెంటులో మా మైకులు పనిచేయవా అంటే చేస్తాయి. అవి అవుట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ కాదు. కానీ వాటిని స్విచ్ ఆన్‌ చేయలేం. నేను మాట్లాడేటప్పుడు ఈ అనుభవం నాకు చాలాసార్లే ఎదురైంది’ అని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపించిన నోట్ల రద్దు, జీఎస్టీ, చైనా సైన్యం చొరబాటు వంటి తదితర అనేక అంశాలపై పార్లమెంటులో మాట్లాడడానికి ప్రతిపక్షాలను అనుమతించలేదని రాహుల్ గాంధీ అన్నారు.

ఇంకా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ఒకప్పుడు పార్లమెంటు అంటే ప్రధానమైన విషయాలపై లోతైన చర్చలు జరిగే వేదికగా తనకు గుర్తుందని, కానీ ప్రస్తుతం అలంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వచ్చి మాట్లాడగలడని, కానీ భారత్‌లోనే ఏదేని ఒక యూనివర్సిటీలో మాత్రం మాట్లాడలేడని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇక భారత్‌లో బీజేపీని అజేయమైన శక్తిగా ప్రచారం చేయడంమే లక్ష్యంగా మీడియా పనిచేస్తోందని, అయితే ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల గొంతును మాత్రమే తాను వింటానని, బీజేపీ కంటే కాంగ్రెస్‌ పార్టీనే దేశాన్ని ఎక్కువ కాలం పాలించిందని, కానీ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − nine =