అక్టోబర్ నెలలో రూ.1,51,718 కోట్ల జీఎస్టీ ఆదాయం, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే రెండో అత్యధిక వసూలు

October-2022 GST Revenue: Rs 151718 Cr Collected Second Highest Monthly GST Collection till date, GST revenue Rs.151718 crore October, second highest collection GST, GST implementation Highest, GST Amendment Bill, Private Universities Amendment Bill, Mango News, Mango News Telugu, GST and FRBM Amendment Bills, FRBM Amendment Bill, Varsity Recruitment, Telangana Legislature Assembly, Telangana Mansoon Session, GST Bill, Telangana GST Bill, Telangana Assembly Session Live Updates

దేశంలో అక్టోబర్ నెలలో రూ.1,51,718 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇది రెండో అత్యధిక ఆదాయమని తెలిపారు. 2022, ఏప్రిల్ నెలలో మొత్తం రూ.1,67,540 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదవగా, దాని తర్వాత అక్టోబర్ 2022 ఆదాయం రెండవ అత్యధిక నెలవారీ వసూళ్లుగా నిలిచింది. అలాగే 2022, ఏప్రిల్ వసూళ్ల తర్వాత మళ్ళీ అక్టోబర్ నెలలోనే రెండవసారి స్థూల జీఎస్టీ సేకరణ రూ.1.50 లక్షల కోట్ల మార్క్ దాటింది. అయితే 2022 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇలా వరుసగా ఎనిమిది నెలల్లో కూడా రూ.1.40 లక్షల కోట్లకు పైగానే జీఎస్టీ వసూళ్ల సేకరణ జరిగిందని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు.

అక్టోబర్ లో సీజీఎస్టీ వసూళ్లు రూ.26,039 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.33,396 కోట్లు, ఐజీఎస్టీ రూ.81,778 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.37,297 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ.10,505 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన రూ.825 కోట్లతో కలిపి) గా నమోదయ్యాయి. ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సీజీఎస్టీకి రూ.37,626 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీకి రూ.32,883 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత 2022, అక్టోబర్ నెలలో కేంద్రం మరియు రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.74,665 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీకి రూ.77,279 కోట్లుగా ఉంది.

గతఏడాదితో పోలిస్తే ఏపీలో 24%, తెలంగాణలో 11% పెరుగుదల:

ఇక ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది అక్టోబర్ జీఎస్టీ వసూళ్లతో (రూ.2,879 కోట్లు) పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ లో (రూ.3,579 కోట్లు) 24 శాతం పెరిగాయి. అలాగే తెలంగాణలో 2021 అక్టోబర్ లో రూ.3,854 కోట్లు వసూలు కాగా, 2022 అక్టోబర్ లో 11 శాతం పెరుగుదలతో రూ.4,284 కోట్లు వసూలు అయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =