నేడు ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భేటీ, రెండవ వర్చువల్ సమ్మిట్‌ నిర్వహణ

PM Modi Australia PM Scott Morrison will Hold the Second India-Australia Virtual Summit Today, Australia PM Scott Morrison will Hold the Second India-Australia Virtual Summit Today, PM Modi will Hold the Second India-Australia Virtual Summit Today, Second India-Australia Virtual Summit Today, Second India-Australia Virtual Summit, India Second Virtual Summit, Australia Second Virtual Summit, India-Australia Virtual Summit, PM Modi, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, PM Scott Morrison, Scott Morrison, Prime Minister of Australia, Scott Morrison Prime Minister of Australia, Second India-Australia Virtual Summit Latest News, Second India-Australia Virtual Summit Latest Updates, Second India-Australia Virtual Summit Live Updates, Virtual Summit, Second Virtual Summit, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ల మధ్య నేడు (మార్చి 21, సోమవారం) ఇండియా-ఆస్ట్రేలియా వర్చువల్ సమ్మిట్‌ జరుగనుంది. ఇరుదేశాల మధ్య ఇది రెండో వర్చువల్ సమ్మిట్ కాగా, జూన్ 4, 2020న తొలి సమ్మిట్ జరిగింది. ఈ రోజు జరిగే రెండవ వర్చువల్ సమ్మిట్‌ లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద వివిధ కార్యక్రమాలపై సాధించిన పురోగతిని ఇరువురూ నాయకులు సమీక్షించనున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య విభిన్న రంగాలలో కొత్త కార్యక్రమాలు మరియు మెరుగైన సహకారానికి ఈ సమ్మిట్ మార్గం చూపుతుందన్నారు.

ఇరువురూ నాయకులు కూడా వాణిజ్యం, కీలకమైన ఖనిజాలు, వలసలు, మొబిలిటీ మరియు విద్య మొదలైన వాటిలో సన్నిహిత సహకారానికి కట్టుబడి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు కూడా నాయకులు చర్చించనున్నారని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ, సైన్స్ మరియు టెక్నాలజీ, రక్షణ, సైబర్, క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మెటీరియల్స్, నీరు, వనరుల నిర్వహణ, ప్రజా పరిపాలన మరియు పాలన వంటి విస్తృత రంగాలలో భారత్-ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు దేశాలు సన్నిహితంగా సహకరించడం కొనసాగించడంతో ముందుకు కొనసాగించిందని పేర్కొన్నారు. కాగా కోవిడ్-19 మహమ్మారి తర్వాత క్వాడ్ లీడర్స్ సమ్మిట్ లో భాగంగా ప్రధాని మోదీ మరియు ప్రధాని మోరిసన్ సెప్టెంబర్ 2021లో మొదటిసారి వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. అలాగే కాప్-26 లో భాగంగా నవంబర్ 2021లో గ్లాస్గోలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్ (ఐఆర్ఐఎస్)ని సంయుక్తంగా ప్రారంభించారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 2 =