ఐపీఎల్-2021 వేలం: ఎనిమిది ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన క్రికెటర్ల లిస్ట్ ఇదే…

2021 IPL Auction, Chennai, Full List of Players Bought by the 8 Teams, IPL 2021, IPL 2021 Auction, IPL 2021 Auction Live Updates, ipl 2021 auction updates, IPL 2021 player auction, IPL 2021 Players Auction Live Streaming Online, IPL Auction, IPL Auction 2021, IPL Auction 2021 Live, IPL Auction 2021 Live Updates, IPL Auction Live Updates, Mango News

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)-2021‌ వేలం ఫిబ్రవరి 18, గురువారం నాడు చెన్నైలో జరిగింది. 292 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 61 మంది క్రికెటర్లను తీసుకునే అవకాశం ఉన్నా, 57 మంది క్రికెటర్లను మాత్రమే కొనుగోలు చేశాయి. వీరిలో 35 మంది భారతీయ క్రికెటర్లు కాగా, 22 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. పంజాబ్ కింగ్స్ జట్టు ఈ వేలంలో అందరికంటే ఎక్కువుగా 9 మందిని కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యల్పంగా ముగ్గురుని కొనుగోలు చేసింది.

అత్యధిక ధర పలికిన ఐదుగురు ఆటగాళ్లు:

సౌతాఫ్రికా బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ క్రిస్ మోరిస్ కనీస ధర రూ.75 లక్షలు కాగా రూ.16.25 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఐపీఎల్ లో అత్యధిక ధర గతంలో యువరాజ్ సింగ్ (రూ.16 కోట్లు) పేరిట ఉండగా, ఆ రికార్డును క్రిస్ మోరిస్ అధిగమించాడు. న్యూజిలాండ్ బౌలర్ కైల్ జేమిసన్ ను రూ.15 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ను రూ.14.25 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు‌, ఆస్ట్రేలియా బౌలర్ జాయ్ రిచర్డ్ సన్ ను రూ.14 కోట్లకు పంజాబ్ కింగ్స్, బౌలింగ్ ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ ను రూ.9.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నాయి.

ఐపీఎల్-2021 వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన ఆటగాళ్ళ వివరాలు:

చెన్నె సూపర్‌ కింగ్స్‌:

  • మొయిన్ అలీ – రూ.7 కోట్లు
  • కృష్ణప్ప గౌతమ్ – రూ.9.25 కోట్లు
  • చతేశ్వర్ పుజారా – రూ.50 లక్షలు
  • హరిశంకర్ రెడ్డి – రూ.20 లక్షలు
  • భగత్ వర్మ – రూ.20 లక్షలు
  • హరి నిశాంత్ – రూ.20 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్‌:

  • టామ్ కుర్రాన్ – రూ.5.25 కోట్లు
  • స్టీవ్ స్మిత్ – రూ.2.2 కోట్లు
  • సామ్ బిల్లింగ్స్ – రూ.2 కోట్లు
  • ఉమేష్ యాదవ్ – రూ.1 కోట్లు
  • రిపాల్ పటేల్ – రూ.20 లక్షలు
  • విష్ణు వినోద్ – రూ.20 లక్షలు
  • లుక్మాన్ మేరీవాలా – రూ.20 లక్షలు
  • ఎం.సిద్ధార్థ్ – రూ.20 లక్షలు

కోల్‌కతా నైట్ రైడర్స్:

  • షకీబ్ అల్ హసన్ – రూ.3.20 కోట్లు
  • హర్భజన్ సింగ్ – రూ.2 కోట్లు
  • బెన్ కట్టింగ్ – రూ.75 లక్షలు
  • పవన్ నేగి – రూ.50 లక్షలు
  • కరుణ్ నాయర్ – రూ.50 లక్షలు
  • షెల్డన్ జాక్సన్ – రూ.20 లక్షలు
  • వైభవ్ అరోరా – రూ.20 లక్షలు
  • వెంకటేష్ అయ్యర్ – రూ.20 లక్షలు

పంజాబ్ కింగ్స్‌:

  • జాయ్ రిచర్డ్‌సన్ – రూ.14 కోట్లు
  • షారుఖ్ ఖాన్ – రూ.5.25 కోట్లు
  • రిలే మెరెడిత్ – రూ.8 కోట్లు
  • మొయిసెస్ హెన్రిక్స్ – రూ.4.20 కోట్లు
  • డేవిడ్ మలన్ – రూ.1.5 కోట్లు
  • ఫాబియన్ అలెన్ – రూ.75 లక్షలు
  • జలజ్ సక్సేనా – రూ.30 లక్షలు
  • ఉత్కర్ష్ సింగ్ – రూ.20 లక్షలు
  • సౌరభ్ కుమార్ – రూ.20 లక్షలు

ముంబయి ఇండియన్స్‌:

  • నాథన్ కౌల్టర్ నైల్ – రూ.5 కోట్లు
  • ఆడమ్ మిల్నే – రూ.3.2 కోట్లు
  • పియూష్ చావ్లా – రూ.2.4 కోట్లు
  • జేమ్స్ నీషం – రూ.50 లక్షలు
  • యుధ్వీర్ చారక్ – రూ.20 లక్షలు
  • మార్కో జాన్సెన్ – రూ.20 లక్షలు
  • అర్జున్ టెండూల్కర్ – రూ.20 లక్షలు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు :

  • కైల్ జేమిసన్ – రూ.15 కోట్లు
  • గ్లెన్ మ్యాక్స్ వెల్ -రూ.14.25 కోట్లు
  • డేనియల్ క్రిస్టియన్ – రూ.4.8 కోట్లు
  • సచిన్ బేబీ – రూ.20 లక్షలు
  • రజత్ పాటిదార్ – రూ.20 లక్షలు
  • మహ్మద్ అజారుద్దీన్ – రూ.20 లక్షలు
  • కె.ఎస్.భరత్ – రూ.20 లక్షలు
  • సుయాష్ ప్రభుదేశాయ్ – రూ.20 లక్షలు

రాజస్థాన్ రాయల్స్‌:

  • క్రిస్ మోరిస్ – రూ.16.25 కోట్లు
  • శివం దూబే – రూ.4.4 కోట్లు
  • ముస్తఫిజుర్ రెహ్మాన్ – రూ. 1 కోటి
  • లియాన్ లివింగ్స్టన్ – రూ.75 లక్షలు
  • చేతన్ సకారియ – రూ.20 లక్షలు
  • కేసీ కరియప్ప – రూ.20 లక్షలు
  • ఆకాష్ సింగ్ – రూ.20 లక్షలు
  • కుల్దీప్ యాదవ్ – రూ.20 లక్షలు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

  • కేదార్ జాదవ్ – రూ.2 కోట్లు
  • ముజీబ్ ఉర్ రెహ్మాన్ – రూ.1.5 కోట్లు
  • జగదీశ సుచిత్ – రూ.30 లక్షలు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + eight =