గుజరాత్ మోర్బీ బ్రిడ్జి ఘటన: సంఘటన స్థలానికి ప్రధాని మోదీ, మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శ

PM Modi Visited Morbi Bridge Collapse Site and Held Review on Ongoing Rescue Operations, PM Modi Visited Morbi Bridge Collapse Site, Morbi Bridge Ongoing Rescue Operations, PM Review on Ongoing Rescue Operations,Mango News,Mango News Telugu, Morbi Suspension Bridge Collapsed, Gujarat Morbi Bridge, Gujarat Morbi Bridge Collapsed, Gujarat Bridge, Gujarat Latest News And Updates, Morbi Bridge, Gujarat Morbi Bridge News And Live Updates, Morbi Suspension Bridge News And updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం గుజరాత్‌ రాష్ట్రంలోని మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ప్రదేశం వద్దకు చేరుకొని, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మోర్బీకి చేరుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలు, జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్, ఇతర సహాయక చర్యల గురించి అధికారులు ప్రధానికి వివరించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న పలు బృందాల సభ్యులతో ప్రధాని మాట్లాడారు. ఇక ఘటనా స్థలానికి చేరుకోక ముందే ప్రధాని ఆ ప్రాంతంలో ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు.

అనంతరం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ తో కలిసి ప్రధాని మోదీ మోర్బీ సివిల్ ఆసుపత్రికి చేరుకొని, ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి వద్ద ఉన్న కుటుంబ సభ్యులకు ప్రధాని ధైర్యం చెప్పారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా బ్రిడ్జి కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు

మరోవైపు మోర్బీలో జరిగిన బ్రిడ్జి ప్రమాదం నేపథ్యంలో అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు తప్పనిసరిగా బాధిత కుటుంబాలతో టచ్‌లో ఉంటూ, ఈ విషాద సమయంలో వారికి అన్ని విధాలా సహాయం అందేలా చూడాలని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలు మరియు బాధితులకు అందించిన సహాయాన్ని అధికారులు ప్రధానికి వివరించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను గుర్తించే సవివరమైన మరియు విస్తృతమైన విచారణను నిర్వహించడం ప్రస్తుత ఆవశ్యకమని ప్రధాని అన్నారు. విచారణ నుండి కీలకమైన విషయాలను త్వరగా అమలు చేయాలని కూడా అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం భూపేంద్ర భాయ్ పటేల్, హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి, గుజరాత్ ప్రభుత్వ మంత్రి బ్రిజేష్ మెర్జా, గుజరాత్ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ, స్థానిక కలెక్టర్, ఎస్పీ, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =