మార్చి 12న కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, బెంగ‌ళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేని జాతికి అంకితం

PM Modi will Visit Karnataka on 12th March Will Dedicate Bengaluru-Mysuru Expressway IIT Dharwad to the Nation,PM Modi will Visit Karnataka on 12th March,Bengaluru-Mysuru Expressway,IIT Dharwad to the Nation,Mango News,Mango News Telugu,PM Modi to dedicate to nation Bengaluru,PM Modi To Visit Poll-Bound Karnataka,PM Modi to lay foundation stone,Modi to visit Karnataka,Indian Prime Minister Narendra Modi,Narendra modi Latest News and Updates, National Political News,Karnataka News Today,Bengaluru Latest Updates

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఎల్లుండి (మార్చి 12, ఆదివారం) క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ పర్యటనలో భాగంగా దాదాపు రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయడంతో పాటుగా శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ముందుగా ప్రధాని మాండ్య‌లో పర్యటించనున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో బెంగ‌ళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు.

ఈ ప్రాజెక్ట్‌లో NH-275లోని బెంగళూరు-నిడఘట్ట-మైసూరు సెక్షన్‌లో 6-లేనింగ్ లో ఉంటుంది. దాదాపు 8480 కోట్ల రూపాయల వ్యయంతో 118 కి.మీ పొడవున ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఇది బెంగళూరు మరియు మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 3 గంటల నుండి 75 నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా మైసూరు- కుశాల్‌ నగర్ 4 లేన్ హైవేకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 92 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టును దాదాపు రూ.4130 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. బెంగుళూరుతో కుశాల్‌నగర్ కనెక్టివిటీని పెంచడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని మరియు ప్రయాణ సమయాన్ని 5 నుండి 2.5 గంటల వరకు సగానికి తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు.

ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం 3:15 గంటలకు హుబ్బ‌ళ్లి-ధార్వాడలో ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నారు. ఐఐటీ ధార్వాడ్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన కూడా ప్రధాని మోదీనే చేశారు. 850 కోట్లుపైగా వెచ్చించి దీన్ని అభివృద్ధి చేశారు. అలాగే శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బ‌ళ్లి స్టేష‌న్‌లో ప్ర‌పంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫార‌మ్‌ను ప్ర‌ధాని జాతికి అంకితం చేయ‌నున్నారు. ఈ రికార్డును ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. దాదాపు 20 కోట్ల రూపాయలతో 1507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించారు.

హోసపేట-హుబ్బ‌ళ్లి- తినైఘాట్ సెక్షన్ విద్యుదీకరణ మరియు హోసపేట స్టేషన్‌ను అప్‌గ్రేడేషన్ ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. మరోవైపు హుబ్బ‌ళ్లి-ధార్వాడ్ స్మార్ట్ సిటీ వివిధ ప‌థ‌కాల‌కు ప్ర‌ధాని ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.520 కోట్లు అని తెలిపారు. అలాగే జయదేవ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. దాదాపు రూ.250 కోట్లతో ఆసుపత్రిని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఇక ఈ ప్రాంతంలో నీటి సరఫరాను మరింత పెంపొందించడానికి, రూ.1040 కోట్లతో వ్యయంతో మల్టీ విలేజ్ నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేస్తారు. దాదాపు రూ.150 కోట్ల ఖర్చుతో తుప్పరిహళ్ల వరద నష్టం నియంత్రణ ప్రాజెక్టుకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + five =