జంతర్‌మంతర్‌లో ముగిసిన ఎమ్మెల్సీ కవిత దీక్ష.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ

BRS MLC Kavitha Deeksha For Women's Reservation Bill is Over at Jantar Mantar in Delhi,BRS MLC Kavitha Deeksha is Over,Women's Reservation Bill,Jantar Mantar in Delhi,Mango News,Mango News Telugu,K Kavitha To Hold Hunger Strike,Hunger Strike In Delhi Completed,MLC Kavitha Deeksha is Over in Delhi today,MLC Kavitha Deeksha today,Jantar Mantar Diksha Arrangements,Kalavakuntla Kavitha News,MLC Kavitha Latest News and Updates,Jantar Mantar Diksha Latest Updates,Kavitha Hunger Strike News,Telangana CM KCR's Daughter Strike,BRS leader K Kavitha demand,K Kavitha 12 Hour Long Hunger Strike

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ అమలు చేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది. ఈ ఉదయం 10 గంట‌ల‌కు దీక్ష ప్రారంభమవగా.. సాయంత్రం 4 గంట‌ల‌కు ఎంపీ కే కేశ‌వ‌రావు ఎమ్మెల్సీ క‌విత‌కు నిమ్మ‌ర‌సం ఇచ్చి దీక్ష‌ను విర‌మింప‌జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ సమస్య కానే కాదని, ఇది జాతీయ మహిళల సమస్య అని కవిత పేర్కొన్నారు. అలాగే ఇది ఏ ఒక్క పార్టీకో చెందిన అంశం కాదని, మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని, డిసెంబ‌ర్‌లో పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు పోరాడుతూనే ఉంటామని కవిత స్పష్టం చేశారు. మోదీ స‌ర్కార్ త‌ల‌చుకుంటే పార్లమెంట్‌లో ఈ బిల్లు పాస‌వుతుందని, పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని ఆమె కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 13 =