దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహణ తేదీ ఖరారు

Mango News Telugu, Next Pulse Polio Vaccination, Polio immunisation drive, Polio vaccination drive, Pulse polio drive, Pulse polio immunisation, Pulse Polio Immunisation Drive, Pulse Polio Immunisation Drive In India, Pulse Polio Immunisation Drive news, Pulse Polio Immunisation Drive Starts, Pulse Polio Immunisation Drive Starts from January 31st, Pulse Polio Immunisation Drive Updates

జనవరి 31, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా జాతీయ పల్స్ ‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కు దోహదం చేసేలా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ముందుగా ఈ పల్స్ ‌పోలియో కార్యక్రమాన్ని జనవరి 17 నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కానుండడంతో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

రాష్ట్రపతి కార్యాలయంతో సంప్రదింపులు జరిపిన అనంతరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈనెల 31 కి వాయిదా వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కాగా ఈనెల 30 వ తేదీ ఉదయం 11.45 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో కొందరు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు మర్చిపోకుండా తమ చిన్నారులను పోలియో కేంద్రాల వద్దకు తీసుకెళ్లి చుక్కలు వేయించాల్సిందిగా కేంద్రం విజ్ఞప్తి చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 6 =