పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఎవరు కావాలి? టెలిపోల్ ప్రారంభించిన కాంగ్రెస్

2022 Parliament Budget session, 2022 Union Budget, Budget session of Parliament, Budget Session of Parliament To Be Started, Budget Session of the Parliament 2022, Mango News, Mango News Telugu, Parliament Budget Session, Parliament Budget Session 2022, Parliament Budget Session Live Updates, Parliament Budget Session Start, Parliament Budget Session Updates, PM Modi, Union Budget, Union Budget 2022-23, Union Budget 2022-23 Live Updates, Union Budget 2022-23 Updates

పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయం ఆధారంగా పార్టీ సీఎం అభ్యర్థిని నిర్ణయించడానికి పూనుకుంది. సీఎం అభ్యర్థి విషయంలో మీ ఓటు ఎవరికో తెలియజేయాలని కోరుతూ టెలిపోల్ ను మంగళవారం ప్రారంభించింది. ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్ని, నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ వీరిలో ఎవరు మీ ఎంపిక? లేదా ఎవరూ కాదు? అన్న ఆప్షన్లను ప్రజల ముందుంచింది. ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్ట్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ తనకు అందుబాటులో ఉన్న ఓటర్లను ఈ విషయంలో సంప్రదిస్తోంది. ఎస్ఎంఎస్ లు పంపిస్తోంది.

పంజాబ్ లో ఇప్పటికే, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా భగవంత్ మన్ ను పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం తెలిసిందే. తద్వారా సీఎంను నిర్ణయించే అధికారాన్ని నేరుగా ప్రజలకు ఇచ్చినట్టయింది. ఈ కొత్త సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుండడం ఆసక్తిదాయకం. ఇప్పుడు కాంగ్రెస్ సైతం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మార్గంలో నడుస్తోంది. భవిష్యత్తులో ఈ విధానం దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుందేమో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − six =