ఐపీఎల్-2022 మెగా వేలం : 590 మంది ఆటగాళ్లతో తుదిజాబితా విడుదల

BCCI Announced IPL 2022 Player Auction, BCCI Announced IPL 2022 Player Auction List, BCCI Announced IPL 2022 Player Auction List with a Total of 590 Cricketers, BCCI Announces IPL 2022 Player Auction List, BCCI Releases Full List of 590 Players, IPL 2022 auction, IPL 2022 mega auction, IPL 2022 Player Auction List Announced, IPL 2022 player auction list announced by BCCI, IPL Auction, IPL Auction 2022, IPL Auction 2022 full players list, Mango News

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆడేందుకు వేలం కోసం ముందుగా 1,214 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. తాజాగా 10 ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్/ఎంపిక జాబితా కూడా సమర్పించడంతో, వేలంలో ఉండే 590 మంది క్రికెటర్లతో కూడిన తుది జాబితాను బీసీసీఐ మంగళవారం నాడు ప్రకటించింది. మొత్తం 590 మంది క్రికెటర్లలో 370 మంది భారత్, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్ళలో 228 మంది తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ళు కాగా (క్యాప్‌డ్‌ ప్లేయర్లు), 355 మంది ఇప్పటివరకు దేశానికి ప్రాతినిధ్యం వహించని ఆటగాళ్లు (అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లు) మరియు 7 మంది అసోసియేట్‌ దేశాల క్రికెటర్లు ఉన్నారు.

శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, అజింక్యా రహానే, సురేశ్ రైనా, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేష్‌ యాదవ్‌ వంటి భారత ఆటగాళ్లకు వేలంలో పోటీ నెలకొనే అవకాశం ఉంది. అలాగే డు ప్లెసిస్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, కగిసో రబడ, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డి కాక్, జానీ బెయిర్‌స్టో, జాసన్ హోల్డర్, డ్వేన్ బ్రావో, షకీబ్ అల్ హసన్, వనిందు హసరంగా వంటి విదేశీ ఆటగాళ్లకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. కాగా వెస్టిండీస్‌ బ్యాటర్‌, ఐపీఎల్ చిచ్చరపిడుగు క్రిస్ గేల్‌, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఈ వేలంలో పాల్గొనడం లేదు. ఇక కనీస 2 కోట్ల జాబితాలో 48 మంది ఆటగాళ్లు, 20 మంది కనీస 1.5 కోట్ల ధర జాబితాలో, 34 మంది కోటి రూపాయల కనీస ధర జాబితాలో ఉన్నారు. మనోజ్‌ తివారీ, శ్రీశాంత్ రూ.50 లక్షల కనీస ధర జాబితాలో ఉండగా, మాస్టర్ బ్లస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కనీస ధర రూ.20 లక్షల జాబితాలో ఉన్నాడు.‌

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 2 =