12-17 ఏళ్ల వారికీ మరో వ్యాక్సిన్, కోవోవాక్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ సిఫార్సు

Serum's Covovax Covid-19 Vaccine Gets Nod from SEC for 12-17 Age Group, Serum's Covovax Covid-19 Vaccine, Serum's Covovax Vaccine Gets Nod from SEC for 12-17 Age Group, Nod from SEC for 12-17 Age Group, Serum's Covovax, covid-19 Vaccination In India, Covid 19 vaccines, covid-19 Vaccination, covid-19 Vaccination Live News, covid-19 Vaccination Live Updates, Covid 19 vaccine, Latest Vaccine Information, Covid-19 India Highlights,‎ Omicron India Highlights, Coronavirus, coronavirus india, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Covid Vaccination, Covid Vaccination Updates, Covid Vaccination Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో త్వరలో పిల్లలకు మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవోవాక్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ ను 12 నుండి 17 సంవత్సరాల వయస్సు గల వారికి అత్యవసర వినియోగ అనుమతి కింద ఇచ్చేందుకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ముందుగా కోవోవాక్స్ వ్యాక్సిన్ ను 12-17ఏళ్ల వారికి ఇచ్చేందుకు అనుమతి కోసం సీరమ్‌ సంస్థ ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ పరిశీలన జరిపి అత్యవసర వినియోగ అనుమతి కోసం డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. డీసీజీఐ అనుమతి కూడా లభిస్తే దేశంలో 12-17 ఏళ్ల పిల్లలకు అందించేందుకు అనుమతి పొందిన నాలుగో వ్యాక్సిన్ గా కోవోవాక్స్ నిలవనుంది.

ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌ ను జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి అందిస్తున్నారు. అలాగే జైడస్‌ క్యాడిలా సంస్థ పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన “జైకోవ్‌-డి” అనే కోవిడ్-19 వ్యాక్సిన్ కు, హైదరాబాద్ కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ లిమిటెడ్ రూపొందించిన కోర్బెవాక్స్‌ కోవిడ్ వ్యాక్సిన్ కు 12 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇచ్చేందుకు డీసీజీఐ ఆమోదం తెలిపింది. తాజాగా కోవోవాక్స్ కూడా జాబితాలో చేరనుంది. అయితే కేంద్రప్రభుత్వం ఇంకా 15 ఏళ్ల లోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్‌ ఇచ్చే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు డిసెంబరు 28, 2021న పెద్దల కోసం కూడా అత్యవసర వినియోగానికి కోవోవాక్స్ కు డీసీజీఐ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + thirteen =