రాజకీయ పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ సంచలన ప్రకటన

Super Star Rajinikanth Announced that He Will Not Start a Political Party Now,Actor Turned Politician Rajinikanth Will Not Start A Political Party,Rajinikanth Says Won't Join Politics,Rajinikanth Announces He Will Not Start A Political Party,Superstar Rajinikanth Says Won't Join Politics,Mango News,Mango News Telugu,Super Star Rajinikanth,Actor Rajinikanth,Hero Rajinikanth,Super Star Rajinikanth New Announcement,Rajinikanth,Rajinikanth Latest News,Rajinikanth Political Party,Rajinikanth Political Party News,Rajinikanth Will Not Start a Political Party Now,Rajinikanth Not Going To Launch Political Party,Actor Rajinikanth Won't Start Political Party Now

ప్రముఖ సినీనటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ తన రాజకీయరంగ ప్రవేశంపై మంగళవారం నాడు సంచలన ప్రకటన విడుదల చేశారు. జనవరిలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నానని, పార్టీకి సంబంధించిన వివరాలను డిసెంబర్ 31 వెల్లడించనున్నట్టు గతంలో ప్రకటించిన రజనీకాంత్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. అనారోగ్యం కారణాల దృష్ట్యా పార్టీ పెట్టడం లేదని ఆయన ప్రకటించారు. “ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించవద్దని నిర్ణయించుకున్నాను. ఆరోగ్యం దృష్ట్యా ఆత్మీయులు కూడా వద్దని సలహా ఇచ్చారు. రాజకీయాల్లోకి రాలేనని ఎంతో భారమైన హృదయంతో చెబుతున్నా. రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా ఎప్పటిలాగానే ప్ర‌జాసేవను కొనసాగిస్తాను. ఈ నిర్ణ‌యం వలన అభిమానులు బాధపడితే, క్షమించాల‌ని కోరుతున్నాను” అని రజనీకాంత్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా మూడు పేజీల లేఖను అభిమానులకు విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 2 =