టీ20 ప్రపంచ కప్-2022: రేపే న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్

T20 World Cup-2022 1st Semi Final Between New Zealand and Pakistan Tomorrow at SCG,India Qualified T-20 Worldcup Semi Finals,Pakistan Qualified T-20 Worldcup Semi Finals,T20 World Cup 2022,Mango News,Mango News Telugu,T20 Worldcup Latest News And Updates,T20 World Cup News And Live Updates, Pakistan T20 Worldcup,India T20 worldcup, New Zealand Vs Pakistan,1st Semi Final Between New Zealand and Pakistan

టీ20 ప్రపంచ కప్-2022 లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, భారత్‌, పాకిస్థాన్‌ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (నవంబర్ 9, బుధవారం) మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్ జరగనుంది. సూపర్-12 రౌండ్లో గ్రూప్-1లో 7 పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలిచి న్యూజిలాండ్ సెమీస్ కు చేరుకోగా, గ్రూప్‌-2 లో 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి పాకిస్థాన్‌ సెమీస్ కు వచ్చింది. న్యూజిలాండ్ ఈ టోర్నీని ఆస్ట్రేలియాపై భారీ విజయంతో ప్రారంభించి, క్రమంగా ఆ గ్రూప్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే పాకిస్తాన్ మొదటి రెండు మ్యాచుల్లో భారత్, జింబాబ్వేపై ఓడిపోయి, క్రమంగా పుంజుకుని వరుసగా మూడు విజయాలతో ఎవరూ ఊహించని విధంగా సెమీస్ చేరింది. ఈ క్రమంలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎంతో బలంగా ఉన్న న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య బుధవారం సిడ్నీ గ్రౌండ్ లో ఉత్కంఠభరిత సెమీఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

న్యూజిలాండ్ జట్టులో ముఖ్యంగా బ్యాటింగ్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, అలాగే బౌలింగ్ లో టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ రాణించడంపైనే వారి విజయావకాశాలు ఎక్కువుగా ఆధారపడి ఉన్నాయి. ఇక పాకిస్తాన్ బౌలింగ్ యూనిట్ అత్యంత బలంగా ఉన్నప్పటికీ, ఆ జట్టు కీలక బ్యాటర్స్ అయిన కెప్టెన్ బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ లు అంచనాలకు అనుగుణంగా రాణించడంపైనే ఆ జట్టు సత్తాచాటే అవకాశం ఉంది. టీ20 ప్రపంచ కప్-2022 లో మొదటి సెమీఫైనల్లో విజయం సాధించి ఏ జట్టు ముందు ఫైనల్స్ కు చేరనుందో మరికొద్ది గంటల్లో తేలనుంది.

న్యూజిలాండ్ జట్టు అంచనా: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.

పాకిస్థాన్ జట్టు అంచనా: మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ అజమ్ (కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ వసీమ్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 5 =