దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా క‌మ్యూనిస్టులతో కలిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం – మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

Minister Jagadish Reddy Meets with CPI Leaders To Thanks For The TRS Candidate Win in Munugode,Minister Jagadish Reddy,TRS Candidate Win,TRS Munugode Won, Jagadish Reddy Meets with CPI Leaders,Mango News,Mango News Telugu,CPI Leaders,CPM Leaders,TRS Party,Telangana CM KCR, TRS Working President KTR, Kalvakuntla Kavitha,Telanagana health Minister Harish Rao, Munugode BYpoll Win, Kusukuntla Prabhakar Reddy

దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా క‌మ్యూనిస్టులతో కలిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. మంగళవారం ఆయన సీపీఐ నేతలతో సమావేశమయ్యారు. మునుగోడులో ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డితో కలిసి మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి హైద‌రాబాద్‌లోని సీపీఐ కార్యాల‌యానికి వెళ్లారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి గెలిపించడంలో తమకు మద్దతు తెలిపినందుకు లెఫ్ట్ పార్టీ నేత‌ల‌కు మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు.

టీఆర్ఎస్ అభ్య‌ర్థి విజ‌యానికి సీపీఐ, సీపీఎం నేత‌లు కృషి చేశారని, భ‌విష్య‌త్‌లోనూ ఐక్యంగా క‌లిసి ముందుకు వెళ్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో పాల‌న సజావుగా సాగుతుంటే కొందరు నేతలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఉప ఎన్నిక‌ తెచ్చారని, అయితే మునుగోడు ప్రజల మద్దతుతో, క‌మ్యూనిస్టు పార్టీల స‌హ‌కారంతో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలిచారని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు. ఇక కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి, తన విజ‌యానికి స‌హ‌క‌రించిన సీపీఎం, సీపీఐ నేత‌ల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక‌లో ఓడిపోతే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారని, ఆయన ఇప్పుడు ఆ మాటపై నిలబడతారా? అని ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − twelve =