ఇండియాలో విద్యావంతుల శాతం ఇదే..

What Is The Rank Of India Among The Most Educated Countries,What Is The Rank Of India,Among The Most Educated Countries,India Among The Most Countries,Mango News,Mango News Telugu,Educated People,What Is The Rank Of India, Most Educated Countries,India,South Korea,List Of Most Educated Countries,Most Educated Countries 2023,Rank Of India Latest News,Rank Of India Latest Updates,Rank Of India Live News,Educated Countries Latest News,Educated Countries Latest Updates

విద్యావంతులు ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం ఏదని ఎవరినైనా అడిగితే చాలామంది అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ ఇలా చెబుతారు. కానీ ఇవేమీ కాదని కొత్త అధ్యయనం చెబుతోంది.అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ కాకపోయినా కనీసం యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాల దేశాలున్నాయా అంటే ఇవి కూడా కాదట. ఎవరూ ఏమాత్రం అంచనా కూడా వేయలేని ఆసియా దేశమైన దక్షిణ కొరియా ఈ లిస్టులో మొదటి స్థానంలో పాగా వేసేసింది.

అవును ప్రపంచంలో ఎక్కువ శాతం విద్యావంతులు ఉన్న దేశంగా దక్షిణ కొరియా రికార్డు సృష్టించింది. ఏకంగా 69 శాతం మందితో దక్షిణ కొరియా మొదటి స్ఠానం సంపాదించుకుంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే ఎక్స్ ప్లాట్‌ఫామ్ హ్యాండిల్ చేసిన అధ్యయనంలో ఈ లెక్క తేలింది.అయితే ఈ లెక్కల్లో భారత దేశం ఎక్కడో చిట్టచివరన ఉన్నట్లు అయింది. కేవలం 20 శాతం మంది విద్యావంతులతో.. భారత్ 43వ ర్యాంకును మాత్రం సంపాదించుకుంది. అలాగే 23 శాతం మంది విద్యావంతులతో చైనా 40వ స్థానంలో నిలిచింది. అయితే వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ జాబితాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి మన ఇరుగుపొరుగు దేశాల ఊసు కూడా లేదు.

డిగ్రీ వరకు చదివిన వారిని మాత్రమే విద్యావంతులుగా పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. భారతదేశంలో 25 నుంచి 34 ఏళ్లున్నవాళ్లలో 20 శాతం మంది మంది మాత్రమే కాలేజీ, యూనివర్సిటీ చదువులు చదివారు. దక్షిణ కొరియా తర్వాత.. 67 శాతం మందితో కెనడా రెండో స్థానంలో నిలవగా… తర్వాత స్థానాల్లో జపాన్ 65 శాతంతో, ఐర్లాండ్ 63 శాతంతో, రష్యా 62తో శాతంతో నిలిచాయి. అయితే అగ్రరాజ్యంగా అంతా పిలుచుకునే అమెరికా 51 శాతంతో.. 15వ ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇలా టాప్ టెన్ కంట్రీలను చూసుకుంటే.. మొదటి ప్లేసులో ఉన్న దక్షిణ కొరియాలో 69% మంది విద్యావంతులు ఉండగా..రెండో ప్లేసులో ఉన్న కెనడాలో 67% మంది విద్యావంతులు ఉన్నారు.థర్డ్ ప్లేసులో ఉన్న జపాన్‌లో 65% మంది విద్యావంతులు ఉండగా.. 4 వ స్థానంలో ఉన్న ఐర్లాండ్‌లో 63% మంది విద్యావంతులు ఉన్నారు.

అలాగే 5వ ప్లేసులో ఉన్న రష్యాలో 62% మంది విద్యావంతులు ఉండగా..6 వ స్థానంలో ఉన్న లక్సెంబర్గ్‌లో 60% మంది విద్యావంతులు ఉన్నారు.7 స్థానంలో ఉన్నలిథువేనియాలో 58% మంది విద్యావంతులు ఉండగా..8 ప్లేసులో ఉన్న యూకేలో 57% మంది విద్యావంతులు ఉన్నారు.అలాగే 9 వ స్థానంలో ఉన్న నెదర్లాండ్స్‌లో..56% మంది విద్యావంతులు ఉండగా.. 10 వ స్థానంలో ఉన్న నార్వేలో.. 56% మంది విద్యావంతులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + fifteen =