తిరిగి లాక్‌డౌన్ విధించే అవకాశం లేదు – మంత్రి సత్యేందర్‌ జైన్

Delhi, Delhi Health Minister, Delhi Health Minister Satyendar Jain, Delhi Lockdown, Delhi Lockdown News, Health Minister Satyendar Jain, Lockdown, Mango News, No lockdown in Delhi, No reimposing lockdown, No Reimposition of Lockdown, No reimposition of lockdown in Delhi, Satyendar Jain, Satyendar Jain Says No Re-imposition of Lockdown, third wave of Covid-19 has passed

ఢిల్లీలో మరోసారి పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తిరిగి లాక్‌డౌన్ విధించవచ్చని వస్తున్న వార్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్ స్పందించారు. ఢిల్లీలో మళ్ళీ లాక్‌డౌన్ విధించే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం ప్రభావవంతమైన లేదా సరైన చర్య అవుతుందని భావించడం లేదు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సత్యేందర్‌ జైన్ పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో మూడవ దశ కరోనా వ్యాప్తి కూడా గరిష్ఠానికి చేరుకుందని చెప్పారు.

మరోవైపు ఢిల్లీలో కరోనా ప్రభావం, నియంత్రణ చర్యలపై ఆదివారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం కేజ్రీవాల్‌ సహా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీ ఆసుపత్రుల్లో అదనంగా ఐసీయూ పడకలు సమకూర్చడం, రోజువారీ కరోనా పరీక్షలు లక్షకు పెంచడం, అధిక ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మొబైల్ టెస్టింగ్ వ్యాన్స్, రిటైర్డ్ డాక్టర్స్ మరియు నర్సులను నియమించడం, డోర్ టూ డోర్ సైంటిఫిక్ సర్వే నిర్వహణ వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఢిల్లీలో నవంబర్ 15, ఆదివారం నాటికీ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,85,405 కి చేరింది. 4,37,801 మంది కోలుకోగా, ప్రస్తుతం 39,990 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా వలన ఢిల్లీలో ఇప్పటికి 7,614 మంది మరణించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 14 =