జనవరి 28న తిరుమ‌ల‌లో రథసప్తమి వేడుకలు, ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం: టీటీడీ

TTD Announces Ratha Saptami Celebrations to be held in Tirumala on January 28th,TTD Announces, Ratha Saptami,Ratha Saptami Celebrations,TTD Ratha Saptami Celebrations,Tirumala on January 28th,Ratha Saptami Celebrations on January 28th,Mango News,Mango News Telugu,Senior Citizens,Challenged Persons Tickets,December Quota,Tirumala,Tirupati,Tirumala Tirupathi Devasthanam,TTD Latest News And Live Updates,December Quota TTD, TTD

సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం వేడుకలు జరుపనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ తెలిపింది. అలాగే రథసప్తమి పర్వదినం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్టు చెప్పారు. ఈ మేరకు టీటీడీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

వాహన సేవల వివరాలు (జనవరి 28న) :

  • ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు (సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం
  • ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం
  • ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు – గరుడ వాహనం
  • మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం
  • సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
  • సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
  • రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =