నేనెప్పుడూ కెప్టెన్ లాగానే ఆలోచిస్తాను – విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌ కావడానికి కంటే ముందు ఇతర కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడినప్పుడు కూడా కెప్టెన్‌గా తనను తాను ఎప్పుడూ భావించేవాడినని చెప్పాడు. అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత విరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ 2014లో భారత టెస్ట్ కెప్టెన్‌గా MS ధోని నుండి బాధ్యతలు స్వీకరించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన భారత్ కెప్టెన్‌లలో ఒకరిగా నిలిచాడు. టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన 68 టెస్టుల్లో 40 విజయాలు అందించాడు విరాట్ కోహ్లీ. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీని వదులుకున్నాడు కోహ్లీ. అయితే అతను వన్డేలకు, టెస్ట్ లకు కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే, టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సత్తా చాటలేకపోయింది.

ఆ తర్వాత కోహ్లీని వన్డే కెప్టెన్ గా తొలగించారు. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ భారత్‌కు నాయకత్వం వహించాడు. ఈ సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత కోహ్లీ సోషల్ మీడియా ద్వారా టెస్ట్ కెప్టెన్సీని వదులుకుంటున్నట్లు ప్రకటించాడు. గెలవడం లేదా గెలవకపోవడం అనేది మన చేతుల్లో లేదు, ప్రతిరోజూ మెరుగ్గా ప్రయత్నిస్తాం. అన్ని రకాల పాత్రలు మరియు అవకాశాలను స్వీకరించాలని నేను భావిస్తున్నాను. నేను MS ధోని నాయకత్వంలో కొంతకాలం ఆడాను, ఆపై నేను కెప్టెన్‌ని అయ్యాను, నా మైండ్‌సెట్ ఇంతకాలం అలాగే ఉంది. నేను ఎప్పుడూ కెప్టెన్‌గానే భావించాను. నేను నా స్వంత నాయకుడిగా ఉండాలనుకుంటున్నాను అని కోహ్లీ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్ ఏ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =