కెనడా దేశంలో కరోనా ప్రకంపనలు.. అజ్ఞాతంలోకి ప్రధాని జస్టిన్ ట్రూడో

Canadian PM, Canadian PM Justin Trudeau, Canadian PM Justin Trudeau Moved To Secret Location, Canadian PM Justin Trudeau Moved To Secret Location as Anti-Covid Rules Protests Flare-up, Canadian PM Justin Trudeau Moved To Secret Location as Anti-Covid Rules Protests Flare-up in The Country, Canadian PM moved to secret location, Canadian PM moved to secret location as anti-COVID rules protests, Canadian PM Trudeau, Justin Trudeau, Mango News, Thousands protest against Covid vaccine, Thousands protest against Covid vaccine mandate in Canada, Thousands stage protest in Ottawa against Canada’s vaccine

కెనడా దేశంలో కరోనా ప్రకంపనలు రేపుతోంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు రాజధాని ఒట్టావాలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించటంతో ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడింది. తదనంతర పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రధాని జస్టిన్ ట్రూడో సహా ఆయన కుటుంబాన్ని సైన్యం రహస్య ప్రాంతానికి తరలించింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కొవిడ్ వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. తాజాగా కెనడా కూడా కోవిడ్ వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జరీ చేసింది. దీంతో.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమంది ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రధాని జస్టిన్ ట్రూడో విధించిన కరోనా నిబంధనలను వ్యతిరేకిస్తూ ‘ఫ్రీడమ్ కాన్వాయ్’ పేరుతో ట్రక్కు డ్రైవర్లు కెనడా రాజధాని ఒట్టావాను ముట్టడించారు. కెనడా దేశంలో రాష్ట్రాల సరిహద్దులు దాటే ట్రక్కు డ్రైవర్లకు టీకా తప్పనిసరి అనే నిబంధనను అధికారులు అమలు చేయటాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. వందలాది మంది నిరసనకారులు పార్లమెంటరీ ఆవరణలోకి రావడంతో.. ఈ ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందుజాగ్రత్తగా ప్రధాని జస్టిన్ ట్రూడో, అతని కుటుంబ సభ్యులను అధికారిక నివాసం నుంచి అజ్ఞాత ప్రదేశానికి తరలించినట్టుగా కెనడా మీడియాలో కథనాలు వెల్లడించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 20 =