10 లక్షలకు చేరువలో నవ ఓటర్లు..మహిళా ఓటర్లే ఎక్కువ

3 26 18 205 voters in Telangana,voters in Telangana,3 26 18 205 voters, New voters, Women voters are more,Telangana Assembly Elections 2023,TRS, Congress, Bjp,Mango News,Mango News Telugu,Women voters outnumber men in Telangana,State Announced by Election Commission,Telangana Elections 2023,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Telangana Assembly Elections Live News
3,26,18,205 voters in Telangana, New voters, Women voters are more,Telangana Assembly Elections 2023,TRS, Congress, Bjp,

తెలంగాణ ఎన్నికల కోసం ఓటర్ల లిస్టు రెడీ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య తాజాగా 3,26,18,205కు చేరుకుంది. అయితే ఈ లిస్టు ప్రకారం అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో మహిళా ఓటర్లు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో  ఓటుహక్కు వినియోగించుకోవడానికి తయారయిన లిస్టులో పురుషులు 1,62,98,418 మంది, మహిళలు 1,63,01,705 మంది ఉన్నారు.

తెలంగాణలో జరిగే శాసనసభ ఎన్నికల కోసం  ఎన్నికల సంఘం..సెప్టెంబరు నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను  చేపట్టింది. షెడ్యూలు విడుదలకు ముందుగా  తుది ఓటర్ల జాబితాను అక్టోబరు 4న  ప్రకటించింది. తుది ఓటర్ల జాబితా ప్రకారం.. మొత్తం 3,17,32,727 మంది ఓటర్లు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 9న ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించగా తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది.

దీనికోసం అక్టోబరు 31 వరకు ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి ఈసీ వెసులుబాటు కల్పించింది. వచ్చిన దరఖాస్తులను నవంబరు 10 వరకు పరిష్కరించిన  అధికారులు.. తాజాగా జిల్లాల వారీగా  ఆయా జిల్లాల కలెక్టర్లు  తుది ఓటర్ల జాబితాలను ప్రకటించారు. దీని ప్రకారం అక్టోబరు 4న ప్రకటించిన జాబితాతో పోలిస్తే 8,85,478 మంది ఓటర్లు పెరిగారు. అలాగే అక్టోబరు 4న ప్రకటించిన జాబితాలో మహిళా ఓటర్ల కంటే పురుషులు 28,154 మంది ఎక్కువగా ఉండగా.. తాజాగా దాన్ని మహిళా ఓటర్లు  అధిగమించారు. పురుష ఓటర్ల కన్నా 3,287 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా నమోదయ్యారు.

తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 75 స్థానాల్లో పురుషుల కంటే కూడా మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 44 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండగా.. 26 జిల్లాల్లో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలలో మాత్రమే పురుష ఓటర్లు ఎక్కువగా ఉండగా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

తెలంగాణలో మొత్తంగా రికార్డుస్థాయిలో 9,99,667 మంది నవ ఓటర్లు  నమోదయి  10 లక్షలకు చేరువ అయ్యారు . అక్టోబరు 4న ప్రకటించిన జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల వయసు గల ఓటర్లు 8,11,648 మంది ఉండగా.. అక్టోబరు 31 తర్వాత మరో 1,88,019 మంది నమోదయి ఎన్నికల అధికారులను ఆశ్చర్యంలో పడేశారు. అయితే మొత్తం ఓటర్లలో ట్రాన్స్‌జెండర్లు 2,676 మంది, సర్వీసు ఓటర్లు 15,406 మందిగా నమోదయినట్లు ఈసీ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + three =