వీసాలు కావాలా? కానీ ఒక్క కండీషన్ అంటోన్న భారత్

Need visas But there is only one condition India,Need visas,There is only one condition,one condition India Need visas,Mango News,Mango News Telugu,India, Canada, Need visas, India condition,Union External Affairs Minister Jai Shankar, Canadian PM Justin Trudeau,Visa policy of India,Visa requirements for Indian citizens,India International Travel Information,India visas Latest News,India visas Latest Updates
India, Canada, Need visas, India condition,Union External Affairs Minister Jai Shankar, Canadian PM Justin Trudeau

భారతదేశం, కెనడా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొనడంతో..  కొద్ది రోజుల క్రితం కెనడియన్లకు వీసా సేవల్ని ఇండియా తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే తాజాగే ఇదే  అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెనడా వీసా సర్వీసుల్ని పునరుద్ధరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే కెనడా ఓ కండీషన్‌ను అంగీకరించాల్సి ఉంటుందని చెప్పారు.

వియన్నా కన్వెన్షన్ ప్రకారం.. కెనడాలోని భారత దౌత్యవేత్తలకు కెనడా ప్రభుత్వం భద్రత కల్పిస్తామని మాటిస్తే.. వీసా సర్వీసుల్ని తిరిగి ప్రారంభిస్తామని అన్నారు. ఎందుకంటే వీసాల జారీ కోసం భారత దౌత్యవేత్తలు.. ఆఫీసులకు వెళ్లి పని చేయాల్సి ఉంటుందని.. అయితే ఇప్పుడు నెలకొన్న దౌత్య వివాదం వల్ల వాళ్లకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే కొద్ది రోజుల క్రితం వీసా సర్వీసుల్ని తాము నిలిపివేసినట్లు చెప్పారు.

వియన్నా కన్వెన్షన్‌ అత్యంత ప్రాథమిక అంశం ఏంటంటే.. దౌత్యవేత్తల రక్షణ, భద్రతను నిర్ధారించడం.ఇప్పుడు నెలకొన్న దౌత్య వివాద పరిస్థితుల్లో కెనడాలో ఉంటున్న భారత ప్రజలే కాదు..భారత దౌత్యవేత్తలు కూడా సురక్షితంగా లేరు. దీనికి సాక్ష్యంగా కొన్ని సంఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి.

దీంతోనే జై శంకర్ ఒకవేళ భారతదేశపు దౌత్యవేత్తలకు కెనడా గవర్నమెంట్ భద్రత కల్పిస్తే.. తిరిగి అక్కడి పరిస్థితులు పురోగతి చెందితే.. వీసాల సమస్యను  మళ్లీ ప్రారంభించాలని తాము కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.  ఇది చాలా త్వరగా జరగాలని తాము ఆశిస్తున్నామని  జైశంకర్అన్నారు. ప్రస్తుతం భారతదేశం, కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్లిష్టంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.  కెనడా రాజకీయాల్లోని ఒక నిర్దిష్ట విభాగంతో పాటు.. దాని విధానాల వల్ల భారతదేశానికి సమస్య ఉందని వివరిస్తూ.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి చురకలంటించారు.

మరోవైపు ఖలిస్తానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో.. ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన సంచలన ఆరోపణలను ఇండియాతో పాటు చాలా దేశాలు ఖండించాయి. కెనడా ప్రధాని ఈ  ఆరోపణలు చేయడంతో పాటు .. భారత దౌత్యవేత్తని కూడా బహిష్కరించారు. దీంతో..రెండు దేశాల మధ్య దౌత్య వివాదం ఒక్కసారిగా భగ్గుమంది.

కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలను భారత్ దేశం తిప్పికొడుతూ..భారత్‌లో ఉంటున్న కెనడా దౌత్యవేత్తను తిరిగి వారి దేశానికి పంపించింది. అంతేకాదు  వీసా సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది. దౌత్యవేత్తలు సమానంగా ఉండాలన్న నిబంధనను భారత్ ఉటంకిస్తూ.. 40 మంది దౌత్యవేత్తలను వారి దేశానికి తిరిగి  రప్పించుకోవాలని కెనడాకు  అల్టిమేటం జారీ చేసింది. దీంతో.. ఈ నెల 20న కెనడా ప్రభుత్వం వాళ్లను తిరిగి వెనక్కు పిలిపించుకుంది. ఇలాంటి సమయంలో జై శంకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 19 =