ప్ర‌చారంలో అగ్ర‌ప‌రివారం..

Delhi Leaders Came to Telangana,Delhi Leaders,Leaders Came to Telangana,Telangana Assembly Elections, Delhi Leaders, Modi, Amit Shah, Rahul Gandhi, Priyanka Gandhi,Mango News,Mango News Telugu,Delhi Leaders Latest News,Delhi Leaders Latest Updates,Telangana Elections,Telangana Latest News And Updates,Telangana Election Latest Updates,Telangana Politics, Telangana Political News And Updates,Barrelakka Latest News
telangana assembly elections, delhi leaders, modi, amit shah, rahul gandhi, priyanka gandhi

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం పీక్ కు చేరింది. మ‌రో మూడు రోజుల గ‌డువు మాత్ర‌మే ఉండ‌డంతో పార్టీల‌న్నీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. ఉన్న స్వల్ప సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అన్ని పార్టీలూ పరుగులు పెడుతున్నాయి. దీంతో హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోనూ  పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది.  రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌కు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌లు తప్ప వేరే ప్రచార స్టార్‌లు లేరు. వారే రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కేటీఆర్‌ అయితే ఎవరూ ఊహించని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే  రోడ్‌షోలు, హోటళ్లలో ముచ్చట్లు పెట్టిన ఆయన నిన్నమెట్రోలోనూ ప్రయాణం చేసి ప్రయాణికుడిగా మారిపోయారు. ప్రజానాడిని పట్టే పనిచేశారు.

కాంగ్రెస్, బీజేపీ జాతీయనేతలు విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. నిన్న బీజేపీ ప్రచారం కోసం కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌ వేర్వేరు ప్రాంతాల్లో నగరంలో రోడ్‌షోలు నిర్వహించారు. ఈరోజు కూడా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్య‌నాథ్‌, జేపీ న‌డ్డా తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం చేప‌ట్టారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డీకే శివ కుమార్, రేవంత్ రెడ్డి  ప్ర‌చారాన్ని హీటెక్కిస్తున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సభకు క‌మ‌లం నేత‌లు భారీ స్థాయిలో జ‌నాన్ని త‌ర‌లించారు. ఇక మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ‌లో అధికారం ఇస్తే.. పెట్రో, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తుండటంతో ఆయ‌న ల‌క్ష్యంగా మోదీ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కారేనని అన్నారు కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా. తెలంగాణలో ముస్లింలకు 4 శాతం మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చారని.. బీజేపీ ప్రభుత్వం రాగానే ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు పెంచుతామ‌ని ప్ర‌క‌టించారు.

కాంగ్రెస్ నేత‌లు స‌భ‌లు, రోడ్ షోలు, కార్న‌ర్ మీటంగ్ ల‌తో ప్ర‌చారాన్ని హీటెక్కిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుని అధికారంలోకి వ‌చ్చేందుకు శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. క‌రెంట్ పై గ‌తంలో నోరుజారిన రేవంత్ రెడ్డి.. ఆ ప్ర‌భావం ఎన్నిక‌ల్లో ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వ్య‌వ‌సాయానికి 24 గంట‌లూ నాణ్య‌మైన ఉచిత క‌రెంట్ అందించ‌డంతో పాటు.. గృహ క‌నెక్ష‌న్ల‌కు 200 యూనిట్ల వ‌ర‌కూ ఉచితం ప్ర‌క‌టిస్తూ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మూడు పార్టీలు.. ముప్పేట తెలంగాణలో ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతుండ‌డం ఆస‌క్తిగా మారింది. ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీల నాయకులూ బిజిబిజీగా ఉన్నారు. ఓ జాతీయ పార్టీ ముగ్గురు ముఖ్య నేతలు, అందులోనూ ప్రధాని, కేంద్ర హోం మంత్రి స్థాయి వ్యక్తులు ఒకే రోజున ఒకే రాష్ట్రంలో ఉండడం అరుదనే చెప్పాలి. మోదీ, షా, నడ్డా ముగ్గరు నేతలు శనివారం 9 సభల్లో పాల్గొన్నారు.

ఇక బీఆర్ఎస్ ప్రాజా ఆశీర్వాద సభల పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒకే రోజు పలు సభల్లో పాల్గొంటున్నారు. ఇంతటి తీవ్ర స్థాయి ప్రచారంలో బీఆర్ఎస్ అనూహ్యంగా కేసీఆర్ స‌భ‌ను ర‌ద్దు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం శనివారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాల్సి ఉంది. నగరంలోని నియోజకవర్గాలన్నిటికీ కలిపి ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావించారు. అయితే, వర్షాలను కారణంగా చూపి సభను రద్దు చేశారు. ఈ నెల 28లోగా ఈ సభను ఉంటుందా. లేదా అనే దానిపై స్ప‌ష్ట‌త లేదు. కేటీఆర్ మాత్రం శ‌నివారం నగరంలో మలక్ పేట, గోషామహల్ లో రోడ్ షోలలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − four =