విద్యుత్ రంగ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి

Bhatti Released a White Paper on the Situation in the Power Sector,Bhatti released a white paper,situation in the power sector,Telangana assembly, Batti vikramarka, CM Revanth reddy, Jagadesh reddy,Mango News,Mango News Telugu,Telangana Power Shock,White Papers on Finance,Telangana staring at debt crisis,Telanganas power utilities,Telangana White Paper on Power,Telangana discoms have debt,Deputy CM Bhatti Vikramarka,Bhatti Vikramarka Latest News,Bhatti Vikramarka Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
Telangana assembly, Batti vikramarka, Cm Revanth reddy, Jagadesh reddy

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు కూడా సభ రసవత్తరంగా సాగింది. బుధవారం రాష్ట్ర ఆర్థిక  పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్.. గురువారం విద్యుత్ రంగ పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. తెలంగాణలో విద్యుత్ సరఫరా, ఉత్పత్తి గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో శ్వేతపత్రం విడుదల చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆరోపించారు.

అలాగే జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కలకు రూ. 81 వేల కోట్ల అప్పు.. రూ. 50 వేల కోట్ల పైగా నష్టాలు ఉన్నాయని వివరించారు. విద్యుత్తే రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలిని సూచిస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగం పురోగతికి విద్యుత్ సరఫరానే వెన్నెముక అని చెప్పారు. రవాణా, సమాచార రంగాలు మనుగడ సాగించాలంటే విద్యుత్ సరఫారా చాలా ముఖ్యమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

అటు సభలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. యదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందన్న కోమటిరెడ్డి.. అందులో రూ. 10 వేల కోట్లను జగదీశ్వర్ రెడ్డినే దోచుకున్నారని ఆరోపించారు. కుంభకోణం జరిగింది కాబట్టే విద్యుత్ రంగం అప్పుల్లో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ 24 గంటల కరెంట్ ఇవ్వలేదని.. సబ్‌స్టేషన్లలోని లాగ్ బుక్‌లు చూస్తే ఈ విషయం తెలుస్తుందని అన్నారు.

అయితే అధికార పార్టీ తనపై చేసిన ఆరోపణలను జగదీశ్ రెడ్డి ఖండించారు. తనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్డీతో విచారణ జరిపించాలని స్పీకర్‌‌ను కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని.. విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచామని తెలిపారు. తమ హయాంలో ఒక్కరోజు కూడా పవర్ హాలిడే ఇవ్వలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యుత్ సంస్థల ఆస్తులు రూ. 44.434 కోట్లుగా ఉన్నాయని.. అప్పులు రూ. 22,423 కోట్లు ఉన్నాయని వివరించారు. అలాగే ప్రస్తుతం నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తులు రూ. 1,37,750 కోట్లు, అప్పులు రూ. 81,516 కోట్లు ఉన్నాయని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − five =