గోవా ఎన్నో ప్లేసులో ఉందో తెలుసా?

What are the Most Searched Places on Google This Year,Most Searched Places,Places on Google This Year,What are the Most Searched Places,Year Ender 2023,Most Searched Places on Google, Searched Places This Year,Goa, Srilanka, Bhaali, Vietnam,Thailand,Mango News,Mango News Telugu,Most Searched Places Latest News,Year Ender 2023 Latest Updates,Places on Google Latest News,Places on Google Latest Updates
Year Ender 2023,most searched places on Google, searched places this year,Goa, Srilanka, Bhaali, Vietnam,Thailand

ఎంత బిజీగా ఉన్నా తమకంటూ జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి కొన్ని అనుభూతులు  కావాలని అనుకుంటున్నారు. దీంతో టైమ్ అడ్జెస్ట్ చేసుకుని అయినా సరే తప్పనిసరిగా వెళ్లాలనుకున్న ప్రాంతాలకు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అలా ప్రయాణించే ముందు మంచి టూరిస్టు ప్రాంతాల గురించి ఇంటర్నెట్‌లో వెతికి మరీ తెలుసుకుంటున్నారు. ఇలా 2023లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రదేశాల జాబితాను ఇయర్ ఎండ్ సందర్భంగా గూగుల్ విడుదల చేసింది.

ఈ ఏడాది భారతదేశంలో ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రాంతాల జాబితాలో వియత్నాం ముందు ప్లేసులో నిలిచింది. చాలామంది వియత్నాం గురించే వెతికినట్లు గూగుల్ చెబుతోంది.  దీంతో 2023 సంవత్సరంలో ఎక్కువ మంది శోధించిన ప్రదేశాల జాబితాలో వియత్నాం ఫస్ట్ ప్లేసులో కూర్చుంది. నిజంగానే  ఫారెన్ ట్రిప్ ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులకు ఇది మంచి ప్లేస్ అనే చెప్పుకోవాలి.  దీనికి తోడు భారతీయులకు ఇక్కడ ఫ్రీ వీసా ఎంట్రీ ఉండటంతో ప్రతి ఏడాది  ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. అంతేకాదు వియత్నాం స్ట్రీట్ ఫుడ్స్‌కు  ఎంతో ప్రసిద్ధి చెందిది. అంతేకాకుండా ఇక్కడి కల్చర్ ను అంతా ఇష్టపడతారు.  అలాగే ప్రకృతి సౌందర్యానికి వియత్నాం కేరాఫ్ అడ్రస్‌గా నిలవడంతో.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఇక ఇండియాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన గోవా.. ఈ ఏడాది గూగుల్ విడుదల చేసిన జాబితాలో  సెకండ్ ప్లేసులో  నిలిచింది. ఈ ప్రదేశానికి ఎక్కువగా స్నేహితులు, లవర్స్ వెళుతూ ఉంటారు.  ఇక్కడ ఉండే అందమైన బీచ్‌లు, లివింగ్ కల్చర్.. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా భారత్‌లో ఉన్న ఈ ప్రాంతం గురించే ఎక్కువ మంది వెతికారు.

అలాగే ప్రకృతి  అందాలకు బాగా  ఫేమస్ అయిన బాలి.. 023 సంవత్సరంలో గూగుల్‌లో ఎక్కువమంది వెతికిన  గమ్యస్థానాలలో మూడో స్థానంలో నిలిచింది. విదేశాలలో సందర్శించడానికి బాలి మరొక ప్రసిద్ధ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రకృతి అందాలకు నేచుర్ లవర్సే కాదు.. అంతా ప్రేమలో పడిపోతారు. అందుకే ఈ ప్రదేశాన్ని దేవతల భూమిగా కూడా పిలుచుకుంటారు.

పొరుగు దేశమైన శ్రీలంక  ఈ సంవత్సరం టాప్-4 సెర్చ్డ్ డెస్టినేషన్స్‌లో నిలిచింది. భారతదేశ దక్షిణ తీర ప్రాంతానికి 31 కి.మీటర్ల దూరంలో ఉన్న శ్రీలంక.. దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం అన్న సంగతి తెలిసిందే. హిందూ మహా సముద్రంలోఈ దేశం ఓ ఆణిముత్యంగా చెప్పుకుంటారు. శ్రీలంక జనాభా సుమారుగా 2 కోట్లు మాత్రమే.సహజ అందాలకు కేరాఫ్ అయిన శ్రీలంక పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధిచెందింది. దేశ విదేశాల నుంచి శ్రీలంకకు పర్యాటకులు క్యూ కడుతూ ఉంటారు.

అందమైన పచ్చటి అడవులు, బీచ్‌లు, షాపింగ్‌తో పాటు ఫుడ్ పరంగా కూడా  ప్రసిద్ధి చెందిన థాయ్‌లాండ్.. ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది వెతికిన జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ప్రకృతి అందాలతో  కట్టిపడేసే థాయిలాండ్.. ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.  థాయిలాండ్‌లో ఫుకెట్, కో ఫై ఫై, కరావి వంటి ప్రదేశాలు పర్యాటకంగా  చాలా ప్రసిద్ధి చెందాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =