ఉత్తమ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లి, అధికారులు కృషిని అభినందించిన సీఎం కేసీఆర్

Bhoodan Pochampally Selected as World Best Tourism Village, Bhudan Pochampally gets UN award, CM KCR Appreciated Officials, Mango News, Pochampally, Pochampally selected as UNWTO Best Tourism village, Pochampally Selected as World Best Tourism Village, Pochampally Village, Pochampally Village in Telangana, pochampally village tourism, telangana, UN World Tourism Organization Adjudges Bhoodan, UNWTO selects Pochampally in Telangana

ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్ డబ్ల్యూటీఓ) తొలిసారిగా నిర్వహించిన ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ (బెస్ట్ టూరిజం విలేజ్) ప్రతిష్టాత్మక పోటీలో తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ‘భూదాన్ పోచంపల్లి’ గ్రామం ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు రాగా, భారతదేశం నుంచి సిఫార్సు చేయబడ్డ మూడు గ్రామాల నుంచి భూదాన్ పోచంపల్లి గ్రామం ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికై అరుదైన ఘనతను సాధించింది.

ఈ సందర్భంగా సోమవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, టూరిజం శాఖ ఎండీ బి.మనోహర్ రావులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఇందుకు సంబంధించి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంస్థ జారీచేసిన గుర్తింపు పత్రాన్ని సీఎం చేతుల మీదుగా వారు అందుకున్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను శాలువాతో సీఎం సత్కరించారు. అలాగే టూరిజం శాఖ అధికారులు చేసిన కృషిని సీఎం కేసీఆర్ అభినందించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =