అదానీ కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై ప్రధాని స్పందించాలి, నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలి – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

BRS MLC Kavitha Questions PM Modi Over The Allegations on Adani Group Companies,BRS MLC Kavitha,Questions PM Modi,Allegations on Adani Group,Adani Group Companies,Mango News,Mango News Telugu,National Politics News,National Politics And International Politics,National Politics Article,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

అదానీ గ్రూప్‌ కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఈ వ్యవహారంలో ఆయన స్పందించాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అదానీ వ్యవహారంలో ప్రధాని నైతిక బాధ్యత తీసుకుని ప్రజలకు వివరం ఇవ్వాలని, అలాగే సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దీనిపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. సోమవారం శాసన మండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ.. అదానీ సంస్థల షేర్ల విలువలు దారుణంగా పడిపోతున్నాయని, అయితే దీనివలన దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం ఆక్షేపణీయమని అన్నారు. ఒకప్పుడు రూ. 3600 గా ఉన్న అదానీ కంపెనీల షేర్ విలువ ప్రస్తుతం రూ. 1400కు పడిపోయిందని, దీంతో దాదాపు రూ. 10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపదకు తీవ్ర నష్టం వాటిల్లిందని కవిత తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంకు ప్రకటించినట్లు అంతా సరిగానే ఉంటే.. అదానీ సంస్థలతోపాటు ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి ప్రముఖ ప్రభుత్వ సంస్థల షేర్ల విలువ ఎందుకు పడిపోతుంది? ఈ కారణంగా వీటిలో పెట్టుబడులు పెడుతున్న వారి పరిస్థితి ఏంటి? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇక అదానీకి ప్రధాని మోదీ మద్ధతు ఉందనేది బహిరంగ రహస్యమేనని, అందువల్లే అతి తక్కువ కాలంలోనే ఆయన వ్యాపార విలువ రూ. 60 వేల కోట్ల నుంచి ఏకంగా రూ. 10 లక్షల కోట్లకు చేరిందని ఆమె చెప్పారు. అయితే అదానీ కంపెనీలలో జరుగుతున్న అవకతవకలను ఒక విదేశీ సంస్థ చెప్పేవరకూ మన ప్రభుత్వం ఏం చేస్తోందని, దీనిపై ప్రధాని దేశప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

ఇక మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశాన్ని నిరుత్సాహపర్చితే.. కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ. 2.9 లక్షల కోట్లతో నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ మాత్రం దేశానికి స్పూర్తినిచ్చేలా నిలిచిందని క‌విత‌ పేరొన్నారు. కాగా అదానీ గ్రూప్‌ కంపెనీలకు సంబంధించి ఏ ముహూర్తాన హిండెన్ బర్గ్ నివేదిక వెలుగు చూసిందో.. అప్పటినుండి దేశవ్యాప్తంగా ఇది తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు ఇదే అంశం పార్లమెంటును కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సమావేశాలు ప్రారంభమైనప్పటినుండి కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఉభయ సభల్లో నినదిస్తున్నాయి. ఈ క్రమంలో సమావేశాలను సభాపతులు వాయిదా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =