తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24: దళితబంధు పథకం కోసం రూ.17,700 కోట్లు

Telangana Annual Budget 2023-24: Rs 17700 Cr Proposed for Dalit Bandhu Scheme,Dr. B.R.Ambedkar,Cm Kcr,Ambedkar Inspiration For Dalit Bandhu Scheme,Dalit Bandhu Scheme,Cm Kcr Dalit Bandhu Scheme,Dalit Bandhu Scheme Cm Kcr,Dalit Bandhu Telangana Scheme,Telangana Dalit Bandhu,B.R.Ambedkar Birth Aniversery,Dalit Bandhu Latest News And Updates,Mango News,Mango News Telugu,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు ఈరోజు శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,90,396 కోట్ల‌ అంచనాతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. కాగా ఈ బడ్జెట్ లో దళితబంధు పథకం కోసం రూ.17,700 కోట్లు ప్రతిపాదించడమైనదని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు.

మంత్రి హరీశ్‌ రావు బడ్జెట్ ప్రవేశపెడుతూ, “స్వతంత్ర భారతదేశంలో దళితజాతి నేటికీ అంతులేని వివక్షకు, దాడులకు గురవుతూనే ఉన్నది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతమేరకు వెలుతురు ప్రసరించింది. కానీ, ఆ ప్రయత్నాన్ని దేశ పాలకులు ముందుకు తీసుకుపోలేదు. ఫలితంగా నేటికీ దళితవాడలు వెనుకబాటుతనానికీ, పేదరికానికీ చిరునామాలుగానే ఉండిపోతున్నాయి. అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకమే దళితబంధు. దళితజాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ పథకానికి రూపుదిద్దారు” అని అన్నారు.

“చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. దళితబంధు సాయం వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా, ఆ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడటానికి తోడ్పడుతుంది. దళిత సోదరులు వ్యాపార రంగంలోనూ ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నది” అని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 13 =