ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజు సెలవు : సీఎం కేసీఆర్

CM KCR Decided to Declare the Day after Dussehra as Holiday Every Year

దసరా పండుగ మరుసటి రోజైన 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇకపై ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవుదినంగా నిర్ణయిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు షెడ్యూల్ రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మరోవైపు వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూత అందించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సహాయంగా అందించిన సంగతి తెలిసిందే. మొత్తం 33 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి సహాయంగా అందించే కాన్సెంట్ లెటర్ ను ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలుసుకుని అందించారు. ఈ సందర్భంగా 2019 జూలై నుంచి ఉన్న బ‌కాయి డీఏను ఉద్యోగుల‌కు చెల్లించాల‌ని ఆర్థిక‌శాఖ‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. త్వ‌ర‌లోనే ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో స‌మావేశ‌మై అన్ని అంశాలను చర్చించి, స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =