కర్నాటక రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మరణించడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

CM KCR Express Shock over Loss of Lives of Hyderabad Residents in Karnataka Road Accident, KCR Express Shock over Loss of Lives of Hyderabad Residents in Karnataka Road Accident, Telangana CM KCR Express Shock over Loss of Lives of Hyderabad Residents in Karnataka Road Accident, Loss of Lives of Hyderabad Residents in Karnataka Road Accident, Karnataka Road Accident, Karnataka 8 Hyderabad People Lost Lives as Bus Catches Fire at Kalaburagi District, 8 Hyderabad People Lost Lives as Bus Catches Fire at Kalaburagi District, Karnataka 8 Hyderabad People Lost Lives as Bus Catches Fire, Kalaburagi District, 8 charred to death as bus catches fire after collision in Karnataka, bus catches fire after collision in Karnataka, bus collision in Karnataka, Hyderabad-Bound Private Bus Catches Fire at Kalaburagi District, Karnataka Bus Catches Fire at Kalaburagi District, bus collision, Hyderabad-Bound Private Bus, Kalaburagi, Karnataka Road Accident News, Karnataka Road Accident Latest News, Karnataka Road Accident Latest Updates, Karnataka Road Accident Live Updates, Mango News, Mango News Telugu,

కర్నాటక రాష్ట్రంలోని క‌ల‌బురిగిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ వాసులు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం, తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్నాటక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని క్షతగాత్రులైన వారికి సరైన వైద్యం అందేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ముందుగా శుక్రవారం ఉదయం క‌ర్ణాట‌క‌లోని క‌ల‌బురిగి జిల్లా కమలాపుర వద్ద గోవా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును మినీ లారీ ఢీకొట్టింది. దీంతో ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హైదరాబాద్‌కు చెందిన 8 మంది ప్రయాణికులు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. అలాగే మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయ‌ప‌డిన వారిని క‌ల‌బురిగిలోని 3 ఆసుపత్రులకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్ర‌మాదం జరిగిన స‌మ‌యంలో బ‌స్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో హైద‌రాబాద్‌కు చెందిన రెండు కుటుంబాలు వారే 32 మంది ఉన్నట్టు తెలుస్తుంది. వారు బ‌ర్త్ డే పార్టీ వేడుకల కోసం గోవా వెళ్లి తిరిగి హైద‌రాబాద్‌ కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 17 =