కుప్పంలో మరోసారి హైటెన్షన్‌.. ‘అన్నా క్యాంటీన్‌’ ధ్వంసం, రోడ్డుపై బైఠాయించి టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన

AP Once Again High Tension Prevails in Kuppam During TDP Chief Chandrababu Second Day Tour, TDP Chief Chandrababu Second Day Tour In Kuppam, AP Once Again High Tension Prevails in Kuppam, High Tension Prevails in Kuppam, TDP Chief Chandrababu Kuppam Visit, Chandrababu Kuppam Tour, TDP Chief Chandrababu, Nara Chandrababu Naidu, Kuppam, Chandrababu Kuppam Tour News, Chandrababu Kuppam Tour Latest News And Updates, Chandrababu Kuppam Tour Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రెండోరోజైన గురువారం కుప్పంలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. నిన్న సాయంత్రం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం కొల్లుపల్లెలో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగి గహర్షణ పడటంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తేవడం తెలిసిందే. ఈ క్రమంలో నేడు కుప్పంలో చంద్రబాబు ప్రారంభించాల్సిన ‘అన్నా క్యాంటీన్‌’ వద్ద మరోసారి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు నిరసనకు దిగడంతో పాటు ‘అన్నా క్యాంటీన్‌’ను ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీనిపై సమాచారం అందుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే అక్కడకు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను టీడీపీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ శ్రేణుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన ప్రారంభించారు. వైసీపీ కార్యకర్తల చర్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‎కు తరలించారు. ఇక కుప్పం పట్టణంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో.. అప్రమత్తమైన అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. అలాగే ముందు జాగ్రత్తగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో కుప్పంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + six =