తెలంగాణలో షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్ర‌స‌క్తే లేదు – సీఎం కేసీఆర్

CM KCR Gives Clarification Over MLA Tickets and Assembly Elections in Telangana at TRS Party Executive Meeting,CM KCR Clarification Over MLA Tickets,Assembly Elections in Telangana,TRS Party Executive Meeting,Mango News,Mango News Telugu,TRS Govt, Telangana Politics Latest News And Updates,Telangana CM KCR, KTR, Kalavakuntla Kavitha, Telanagana TRS,K Chandra Shekar Rao,Kalavakuntla Taraka Rama Rao,TRS Latest News And Updates

తెలంగాణలో షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు జరుగుతాయని, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మార్చే ప్ర‌స‌క్తే లేదని స్పష్టం చేశారు ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తద్వారా ఇటీవలి కాలంలో తరచుగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు మంగళవారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నిక‌లకు కేవలం ప‌ది నెల‌ల స‌మ‌యమే ఉందని, కాబట్టి ఇప్పటినుంచే పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పోరాడాల్సిందేన‌ని స్పష్టం చేసిన ఆయన ఏ ఒక్కరూ సీబీఐ, ఈడీ దాడుల‌కు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని భరోసానిచ్చారు.

అలాగే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పాత వారికే టికెట్లు కేటాయిస్తామ‌ని, ఎట్టిపరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. కనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ పది నెలల పాటు నిత్యం ప్ర‌జ‌ల‌లో ఉండాలని, వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఇంకా ప్ర‌భుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఇక రానున్న ఎన్నికల్లో మునుగోడు త‌ర‌హాలో వ్యూవహాలను ప్రతి నియోజకవర్గంలో అమలు చేయాలని, పార్టీలోని ప్రతి కార్యకర్తా తమ పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలని, అలా చేస్తే వంద శాతం మ‌ళ్లీ టీఆర్ఎస్‌దే అధికార‌మ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 2 =