దళిత బంధు పథకాన్ని ఎవ్వరూ ఆపలేరు – సీఎం కేసీఆర్

#KCR, CM KCR Elected as Party Chief Again, cm kcr speech, CM KCR Speech at TRS Party Plenary Meeting, CM KCR Speech at TRS Party Plenary Meeting Today, kcr speech, Mango News, TRS Celebrates Twenty Years Of Formation, TRS Conducts Plenary Meeting And Grand Event At HICC, TRS Party, TRS Party News, TRS Party Plenary Meeting, TRS Party Plenary Meeting Today, TRS Party Plenary Today, TRS Party Updates, TRS Plenary, TRS Plenary Meeting, TRS Plenary News, TRS Plenary Updates, TRS will zoom in on party structure

హైదరాబాద్ లోని మాదాపూర్‌ హెటెక్స్‌లో సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్లీనరి సమావేశం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్లీనరీలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా సీఎం కె.చంద్రశేఖర్‌ రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరు‌సగా తొమ్మి‌దో‌సారి కూడా టీఆర్ఎస్ అధ్యక్షునిగా సీఎం ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు పార్టీ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. అనంతరం ప్లీన‌రీ వేదిక‌గా సీఎం కేసీఆర్‌ కీలక ప్రసంగం చేశారు.

స్వరాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేయడం వలనే తెలంగాణ‌ను సాధించుకున్నామ‌ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. చ‌రిత్ర‌లో తెలంగాణ ఉద్య‌మ పోరాటానికి, ఉద్య‌మ‌కారుల‌కు కీర్తి శాశ్వ‌తంగా ఉండిపోతుందని చెప్పారు. గత ఏడేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఉన్న అపోహలన్నీ పోగొట్టి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముం‍దుకు వెళ్తున్నామని, దేశంలో తెలంగాణ ప‌థ‌కాలు ఆదర్శంగా నిలిచేలా అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ పథకాలను ఇత‌ర రాష్ట్రాలు, కేంద్రం కూడా కాపీ కొడుతుంద‌న్నారు. ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచామని అన్నారు.

దళిత బంధు పథకాన్ని ఎవ్వరూ ఆపలేరు:

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టండి, గెలిపించుకుంటామని చెబుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో అమలయ్యే పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. నాందేడ్‌, రాయచూర్‌ జిల్లాల నుంచి తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ డిమాండ్లు వస్తున్నాయన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న దళిత బంధును ఎవ్వరూ ఆపలేరు అని, నవంబర్ 4 తర్వాత దళితబంధు కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 11 =