నాగార్జునసాగర్ లో 18872 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు

TRS Candidate Nomula Bhagath Kumar Won in Nagarjuna Sagar By-election,Nagarjuna Sagar Bypoll Results,Sagar Bypoll Results Updates,,Telangana Elections,TRS Candidate Nomula Bhagath Lead In 13Th Round,Nagarjuna Sagar By-election Results,TRS Candidate Nomula Bhagath Grand Victory In Nagarjuna Sagar By Elections,Nomula Bhagath,Nomula Bagath Latest News,Nomula Bhagath Tigergath Win,Nomula Bhagath Victory,Nagarjuna Sagar Byelection Result 2021,Nagarjuna Sagar Byelection Results,Nagarjuna Sagar Byelection Result Latest Update,Sagar Byelection Results Latest Update,Sagar Byelection Results Live,Sagar Byelection Results,Nagarjuna Sagar,Sagar Election Results Latest Update,Sagar Election Results Live,Sagar Election Results Latest News,Sagar Election Results,CM KCR

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుమార్ 18872 వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ మొదటినుంచి టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తూ విజయంవైపు దూసుకొచ్చింది. 25 రౌండ్ల తర్వాత పోస్టల్ ఓట్లతో కలిపి టీఆర్ఎస్ కు 89804 ఓట్లు, కాంగ్రెస్‌ కు 70932 ఓట్లు, బీజేపీకి 7676 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి రెండో స్థానంలో నిలవగా, మరోవైపు బీజేపీ పార్టీ కనీస స్థాయిలో కూడ ప్రభావం చూపలేక పోయింది.

ఈ ఎన్నికల బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు నిలిచారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఈ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో తుది ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి నెలకుంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పక్క ప్రణాళికతో పార్టీ నాయకులుకు దిశానిర్దేశం చేయడంతో ఈ పోరులో టీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయాన్ని దక్కించుకుంది. నోముల భగత్ గెలుపుతో తెలంగాణ భవన్ వద్ద నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ, ఆనందంలో మునిగిపోయారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =