ఫిబ్రవరి 10 న హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగసభ

CM KCR will Address the Public Meeting to be held at Haliya on Feb 10

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఫిబ్రవరి 10 న హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగసభ:

ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై చర్చ జరిగింది. వివిధ ప్రాజెక్టుల కింద కవర్ కాగా, మిగిలిన ఆయకట్టుకు సాగు నీరు అందించడానికి అనువుగా రూ.3 వేల కోట్లతో నెల్లికల్లుతో పాటు 8-9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికి ఒకే చోట శంఖుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 10న మద్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంఖుస్థాపన చేస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో జరిగే బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 1 =