బాన్సువాడ నియోజకవర్గంలో పోటాపోటీ సమరం

Competition in Bansuwada Constituency,Competition in Bansuwada,Bansuwada Constituency,Competition in Constituency,Mango News,Mango News Telugu,Bansuwada, party candidate, Bansuwada Constituency,votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,Telangana Assembly Elections 2023,Telangana Assembly Polls,Telangana elections,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Telangana Elections Live News,Bansuwada Constituency Latest News,Bansuwada Constituency Latest Updates
Bansuwada, party candidate, Bansuwada Constituency,votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,

బాన్సువాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగియనుండటంతో.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ క్యాంపయిన్‌లో  దూసుకుపోతున్నారు. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు కూడా రాజకీయంగా అనుభవం ఉన్నవారు కావడంతో ఈ సారి  ఎన్నికల సమరం రసవత్తరంగా మారిపోయింది.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న..స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చరిత్ర ఉంది. ఆయన మంత్రిగానూ కొన్ని సార్లు పని చేశారు. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగు రవీందర్‌రెడ్డి ఏకంగా మూడు సార్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. మరోవైపు  బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన.. యెండల లక్ష్మీనారాయణ ఎంతో కాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగానూ పని చేశారు.

బాన్సువాడ నియోజకవర్గంలో మున్నూరు కాపులు, ఆంధ్రా సెటిలర్లు, మైనారిటీలు, ముదిరాజ్‌లు ఎక్కువ మంది ఉంటారు. దీంతో వీరిలో ఎవరి ఓట్లు ఎవరికి వెళ్తాయన్న దానిపై  అభ్యర్ధుల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ప్రభావం చూపే అంశాలన్నీ బాన్సువాడ నియోజకవర్గంలోనూ కనిపించడం అక్కడ ప్రత్యేకత. నిజానికి  బాన్సువాడ నియోజకవర్గం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కలగలిసి ఉంటుంది. కామారెడ్డి జిల్లాలో  బీర్కూర్‌, బాన్సువాడ పట్టణం,బాన్సువాడ,  నస్రుల్లాబాద్‌ మండలాలు  ఉండగా..  నిజామాబాద్‌ జిల్లా పరిధిలోకి  కోటగిరి,  చందూర్‌, పొతంగల్‌, వర్ని, రుద్రూర్‌, మోస్రా మండలాలు  వస్తాయి.

తాజా ఎన్నికలలో పోటీ చేస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి..ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సీనియర్‌ నేతగా గుర్తింపు ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా,  వరుస విజయాలతో ఊపు మీదున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక మొదటి ఐదేళ్లలో మంత్రిగానూ, తర్వాత అసెంబ్లీ స్పీకర్‌గానూ నియోజకవర్గంలో అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు తీసుకువచ్చిన పేరు శ్రీనివాస్ రెడ్డికి ఉంది. అంతేకాదు బాన్సువాడను మున్సిపాలిటీగా చేసి, పురపాలక శాఖ ద్వారా భారీ ఎత్తున నిధులు రాబట్టి బాన్సువాడను అభివృద్ధి చేశారు.

అలాగే బాన్సువాడ పట్టణంలో మౌలిక వసతులు కల్పించారు. సాగునీటి సౌకర్యాలకు కూడా ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. సిద్దాపూర్‌, జకోరా వంటి ఎత్తిపోతల పథకాలు ఈయన హయాంలోనే పురోగతిలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. అంతేకాదు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంలో తెలంగాణలోనే బాన్సువాడ నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలిపారు. పదకొండు వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి.. లబ్ధిదారులకు అందించిన పేరు కూడా ఉంది. దీంతో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఆయన ఉన్నారు.

మరోవైపు బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగిన నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ.. అవినీతి రహిత పాలన కోసం బీజేపీని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి   కాంగ్రెస్ నుంచి బరిలో దిగడంతో..అందరూ ఉద్దండులే మరి బాన్సువాడ ఓటర్లు ఎవరికి ఓటేస్తారో అన్న చర్చ సాగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − fourteen =