తెలంగాణకు పెట్టుబడి మూడింతల పెంపు..

Foxconn Announces USD 400 Million More Investments For Telangana Unit,Foxconn Announces USD 400 Million,Foxconn More Investments For Telangana Unit,Foxconn For Telangana Unit,Mango News,Mango News Telugu,Foxconn, the supplier of Apple, has also set its sights on Telangana, the $400 million investment in Telangana, Hong Kong Stock Exchange on August 11,Foxconn Latest News,Foxconn Latest Updates,Foxconn Telangana Unit News Today,Foxconn Telangana Unit Latest News,Foxconn Telangana Unit Latest Updates

ప్రస్తుతం ప్రపంచ వ్యాపారాలకు తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిపోయింది. దేశదేశాల నుంచి టెక్ కంపెనీలతోపాటు తయారీ రంగంలోని కంపెనీలు హైదరాబాదుకు తరలి వస్తున్నాయి. తక్కువ రేటుకు లేబర్ అందుబాటులో ఉండటం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆపిల్ సంస్థకు సరఫరాదారైన ఫాక్స్‌కాన్ చూపు సైతం తెలంగాణపై పడింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు గతంలోనే కంపెనీ వెల్లడించింది. అయితే ఇప్పుడు దానిని మరింతగా పెంచాలని నిర్ణయించింది. డైరెక్టర్ల బోర్డు తెలంగాణలో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ఆమోదం తెలిపిందని ఫాక్స్‌కాన్‌ ఇండియా ప్రతినిధి వీ లీ ధృవీకరించారు. ఇదే విషయాన్ని కంపెనీ ఆగస్టు 11న హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో బహిర్గతం చేసింది.

వీ లీ చేసిన పోస్టుపై తెలంగాణ ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తాజాగా ట్వీట్ చేశారు. ఫాక్స్ కాన్ గతంలో ప్రతిపాదించిన 150 మిలియన్ డాలర్ల పెట్టుబడికి తాజాగా ఆమోదించిన 400 మిలియన్ డాలర్లు అదనం కావటం విశేషం. ఫాక్స్‌కాన్ గ్రూప్‌తో మా స్నేహం స్థిరంగా ఉందని.. మొత్తం 550 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో FIT తెలంగాణలో తన వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఎలక్ట్రానిక్స్ మేజర్ ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ మేలో తెలంగాణలో తన 500 మిలియన్ డాలర్ల పెట్టుబడిలో భాగంగా కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రానికి పునాది వేసింది. ఇక్కడికి సమీపంలోని కొంగర కలాన్‌లో ప్రతిపాదిత ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం తైవాన్ సంస్థ గ్లోబల్ విస్తరణ వ్యూహానికి ఒక మైలురాయిగా నిలవనుంది. ప్రతిపాదిత సదుపాయం తెలంగాణలో ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందని తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 1 =