న్యాయవాద దంపతుల హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్ విధింపు

3 Accused was Remanded for 14 Days, Advocate Couple Murder Case, Advocates Murder, HC lawyer couple stabbed to death, HC lawyer couple stabbed to death in Telangana, Mango News, Murder of Advocate Couple, Telangana advocate couple hacked to death, Telangana Advocate Couple Murder, Telangana Advocate Couple Murder Case, Telangana HC Reviews Advocate Couple Murder Case, Telangana High Court advocate Vaman Rao

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో ముందుగా కుంటా శ్రీను, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడుగా కుంటా శ్రీనును, ఏ2గా శివందుల చిరంజీవి, ఏ3గా అక్కపాక కుమార్‌ ను చేర్చినట్టు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. కాగా ఈ ముగ్గురుకి కరోనా పరీక్షలు నిర్వహించి, శుక్రవారం రాత్రి మంథనిలోని జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట పోలీసులు హాజరుపరిచారు.

ఈ సందర్భంగా వారికీ 14 రోజుల పాటుగా రిమాండ్‌ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అనంతరం ముగ్గురు నిందితులను పోలీసులు కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు ఈ కేసులో వాహనం, కత్తులు సమకూర్చాడనే అభియోగాలతో బిట్టు శ్రీను అనే వ్యక్తిని కూడా శుక్రవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 9 =