ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దు, వర్షాలపై అధికారులతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌

#KCR, CM KCR inquires about heavy rains, Floods in Sircilla, Heavy rain triggers floods in Sircilla city, Heavy Rains and Floods in Sircilla, Mango News, Minister KTR, Minister KTR Held Teleconference with District Collector, Several areas in Telangana inundated due to heavy rains, telangana, Telangana CM KCR, Telangana rains, Telangana rains live updates, telangana rains news, telangana rains updates

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద నీరు వచ్చి కాలనీల్లో చేరుతున్న దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతి పెరగడంతో కాలనీలకు భారీగా వరద నీరు వచ్చిన విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అలాగే వరదలో ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు.

మరోవైపు సహాయక చర్యల కోసం హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న 48 గంటల పాటు వర్షపాతం ఉన్నందున వరద మల్లింపుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =