భూపాలపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ సవాళ్లు-ప్రతిసవాళ్లు, ఎమ్మెల్యే గండ్ర సహా పలువురు నేతల హౌస్ అరెస్ట్‌

High Tension Prevails at Jayashankar Bhupalapalli MLA Gandra Venkata Ramona Reddy and Several Congress Leaders House Arrested,High Tension at Bhupalapalli,Jayashankar Bhupalapalli MLA,MLA Gandra Venkata Ramona Reddy House Arrest,Congress Leaders House Arrested,Mango News,Mango News Telugu,Telangna Congress Party,Telangna BJP Party,YSRTP,TRS Party,BRS Party,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News Live,Telangana Chief Minister Kcr,Telangana CM Kcr,Telangana CM Party,Deo Jayashankar Bhupalpally,Bhupalpally District Mandals List,Jayashankar Bhupalpally Collector

జయశంకర్ భూపాలపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మరియు కాంగ్రెస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అవినీతి, కబ్జా ఆరోపణలు రుజువు చేయాలని ఎమ్మెల్యే రమణారెడ్డి సవాల్ విసిరారు. ఈరోజు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తాకు తాను వస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సవాల్ చేశారు. అయితే ఆయన శవాలపై స్థానిక కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు స్పందించారు.

ఎమ్మెల్యే గండ్రపై రేవంత్ చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తాను రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని కూడా ప్రతి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఈరోజు అంబేద్కర్ సెంటర్‌లో బహిరంగ చర్చకు ఇరువురు నేతలు సిద్ధమవుతుండటంతో పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన పట్టణ పోలీసులు భూపాలపల్లి జిల్లాలో 144 సెక్షన్ విధించారు. నేటి నుంచి వారం రోజులపాటు జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, రాజకీయ పార్టీల ర్యాలీలు, సమావేశాలు, బల ప్రదర్శనలు వంటి వాటిపై నిషేధం విధిస్తున్నామని జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

కాగా ఇటీవల రేవంత్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కొంతమంది ఆయనపై కోడిగుడ్లతో దాడి చేయడం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన రేవంత్ తనపై ఇలా దొంగచాటుగా వాళ్లతో వీళ్లతో దాడి చేయించడం కాదని, దమ్ముంటే ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డే నేరుగా వచ్చి తేల్చుకోవాలని సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలన్నీ బయటపెడతామని, అంబేడ్కర్ సెంటర్‌ వద్దకు రావాలని రేవంత్‌ సవాల్ చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే గండ్ర, డేట్, టైమ్‌ ఫిక్స్‌ చేస్తే అంబేడ్కర్ సెంటర్‌కే వస్తానంటూ ప్రతి సవాలు విసిరారు. దీంతో ఆయన సవాలుపై కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు భూపాలపల్లిలో ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =